వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 10, 2007
Appearance
- మీరు సృష్టించదలచిన వ్యాసం పేరును వెతుకు పెట్టెలో రాసి, వెళ్లు గానీ వెతుకు గానీ నొక్కండి. ఆ పేరుతో వ్యాసం లేకపోతే, ఫలితాల్లో పేజీ పేరుతో ఎర్ర లింకు కనిపిస్తుంది. ఆ లింకును నొక్కితే సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి. మీరు సృష్టించదలచిన పేజీ సిద్ధం!
- మరో పద్ధతి.. బ్రౌజరు అడ్రసుపెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ URL ను రాసి ఎంటరు నొక్కండి: http://te.wikipedia.org/wiki/కొత్తపేజీపేరు. సదరు పేజీ యొక్క దిద్దుబాటు పేజీకి వెళ్తుంది. ఇక అక్కడ మీరు రాయదలచిన విషయం రాసేసి పేజీని భద్రపరచండి.
- ఇంకో పద్ధతి.. ఏదో ఒక పేజీ యొక్క మార్చు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెలో మీరు సృష్టించదలచిన పేజీ పేరును రాసి, వికీలింకు ఇవ్వండి. సరిచూడు లింకును నొక్కండి. దిద్దుబాటు పెట్టెకు పైన కనిపించే మునుజూపులో కొత్తపేజీ లింకు ఎర్రగా కనిపిస్తుంది. ఆ లింకును నొక్కి పేజీని సృష్టించండి.