వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 12, 2007
Appearance
1. పైపు కిటుకు: వికీపీడియాలో ఉన్న వ్యాసాలకు వేరే వ్యాసపు పాఠ్యం నుండి లింకు ఇచ్చేటపుడు, లింకు ఇస్తున్న పదం పేరు లక్ష్య వ్యాసం పేరు ఒకటి కాకపోవచ్చు. ఉదాహరణకు, ఏదైనా వ్యాసంలో ఒంగోలు ఎద్దుల గురించి రాస్తూ సంబంధిత వ్యాసానికి లింకు ఇవ్వదలచారనుకోండి.. ఒంగోలు ఎద్దు పేరుతో వికీలో వ్యాసం లేదు గానీ, ఒంగోలు జాతి పశువులు అనే వ్యాసం ఉంది. ఆ పదం నుండి ఆ వ్యాసానికి లింకు ఇలా ఇవ్వాలి: [[ఒంగోలు జాతి పశువులు|ఒంగోలు ఎద్దులు)]]. ఇలా రాసినపుడు వ్యాసంలో ఇలా కనిపిస్తుంది.. ఒంగోలు ఎద్దులు).
2. బహువచన కిటుకు లేదా పొర్లింత కిటుకు: వ్యాసాల్లో ఇతర వ్యాసాల పేర్లను ఉదహరించేటపుడు ఆ వ్యాసం పేరును ఖచ్చితంగా అలాగే రాసే వ్లు ఉండక పోవచ్చు. ఉదాహరణకు,
- కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు. అనే వాక్యంలో అల్లూరి సీతారామరాజును అనే పదానికి లింకు ఇలా ఇవ్వవచ్చు: [[అల్లూరి సీతారామరాజు]]ను. వ్యాసంలో ఇది
- కన్నెగంటి హనుమంతు వలెనే అల్లూరి సీతారామరాజును కూడా తెల్లవారు కాల్చి చంపారు.అని కనిపిస్తుంది. ఈ కిటుకును బహువచన పదాలకు కూడా వాడవచ్చు.
మరింత సమాచారం కోసం: వికీపీడియా:లింకులు urlలు