Jump to content

వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 19, 2007

వికీపీడియా నుండి
ఒకే వ్యాసానికి ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశముంటే.. (దారి మార్పు)

చాలా వ్యాసాలకు ఒకటి కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశముంది. ఉదాహరణకు నందమూరి తారక రామారావు.., ఎన్టీయార్, ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు అనే వివిధ పేర్లతో ప్రసిద్ధుడు. ఆయన గురించిన వ్యాసానికి అన్ని పేర్లతోటీ లింకులు ఉంటే పాఠకులకు వెతకడంలో సౌకర్యం ఉంటుంది. ఒకే వ్యాసానికి అనేక పేర్లు పెట్టడం కుదరదు కాబట్టి, దారిమార్పు పేజీలు అనే సౌకర్యం వికీపీడియాలో ఉంది.

రామారావు గురించిన వ్యాసం నందమూరి తారక రామారావు పేరుతో ఉంది. ఈ వ్యాసానికి చేరుకునేలా ఇతర పేర్లతో దారిమార్పు పేజీలు సృష్టిస్తే సరిపోతుంది. ఆ పని కింది విధంగా చెయ్యాలి. ఎన్.టి.రామారావు పేరుతో ఒక పేజీ సృష్టించి, ఆ పేజీలో కింది పాఠ్యాన్ని చేర్చాలి:

#REDIRECT [[నందమూరి తారక రామారావు]]

ఎన్.టి.రామారావు అనే లింకును నొక్కినపుడు, ఆటోమాటిగ్గా వాడుకరి నందమూరి తారక రామారావు పేజీకి వెళ్తారు. ఆ పేజీలో పేజీ శీర్షిక కిందే "(ఎన్.టి.రామారావు నుండి దారిమార్పు చెందింది)" అనే వాక్యం వచ్చి చేరుతుంది. ఆ విధంగా తాను నొక్కిన లింకు, దారిమార్పు చెంది ఈ పేజీకి వచ్చినట్లు వాడుకరికి తెలుస్తుంది.

గమనిక: ఏదైనా పేజీ పేరు మార్చాలంటే ఈ దారిమార్పు పద్ధతిని వాడకండి. ఎందుకంటే పేజీ చరితం పాత పేజీకే ఉంటుంది. దాని బదులు "తరలించు" అనే అంశాన్ని వాడండి.

దారిమార్పుకు సంబంధించిన మరో చిట్కా వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 1 పేజీలో చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా