వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 2, 2007
Appearance
వ్యాసం పేజీల్లో కనిపించే విషయసూచికను గమనించే ఉంటారు. వ్యాసంలో మూడు కంటే ఎక్కువ విభాగాలు ఉంటే మొదటి విభాగానికి పైన ఈ విషయసూచిక ఆటోమాటిగ్గా వ్యాసానికి వచ్చి చేరుతుంది. విషయసూచిక పక్కనే ఉండే [దాచు], [చూపించు] లింకుల ద్వారా విషయసూచికను కనబడేలాను, కనబడకుండానూ చెయ్యవచ్చు. జావాస్క్రిప్టు ఉన్న బ్రౌజర్లకు మాత్రమే ఇది సాధ్యం. అయితే వ్యాసంలో తగు విధమైన కోడు పదాలను చేర్చి, విషయసూచికను పూర్తిగా లేకుండా చెయ్యడం, ఒక్క విభాగమున్నపుడు కూడా కనబడేలా చెయ్యడం, కావాలనుకున్నచోట కనబడేలా చెయ్యడం వంటివి చెయ్యవచ్చు. వివరాలకు సహాయము:విభాగం#విషయ సూచిక (TOC) చూడండి.