వికీపీడియా:వికీ చిట్కాలు/మార్చి 18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియాలో వర్గాలు


వికీపీడీయాలో వ్యాసాలు రాయడం ఎంత ముఖ్యమో వాటిని వర్గీకరించడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు మీరు రామాయణానికి సంభందించిన వ్యాసాన్ని రాస్తున్నట్లయితే వ్యాసం చివరలో [[వర్గం:రామాయణం]] అని చేర్చవచ్చు. అయితే ఇలా చేర్చేముందు ఆ వర్గం ఇదివరకే ఉందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. వర్గం కోసం వెతకాలంటే వర్గం:రామాయణం అనే పేరుతో వెతుకు పెట్టెలో ఇవ్వాలి. ఇలా వర్గాలు చేర్చడం వలన ఈ వ్యాసం దానంతట అదే వర్గంలో చేర్చబడుతుంది. దీనివలన సందర్శకులకు ఈ వ్యాసాన్ని కనుగొనడం సుళువౌతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా