వికీపీడియా:సమావేశం/ఇందూ జ్ఞాన వేదిక సభ్యులకు డిజిటల్ అవగాహన
Jump to navigation
Jump to search
వివరాలు
[మార్చు]- తేదీ: 2018 జూన్ 9, శనివారం
- సమయం: మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు
నేపథ్యం
[మార్చు]- 2014 జూన్ 14న ఇందూ జ్ఞాన వేదిక వారితో సీఐఎస్-ఎ2కె, తెలుగు వికీపీడియన్లు పుస్తకాల పునర్విడుదల జరిగింది.
- అదేరోజు మధ్యాహ్నం ఇందూ జ్ఞాన వేదిక సభ్యులకు తెవికీ శిక్షణ ఇచ్చారు. సభ్యులు ఇందూ జ్ఞాన వేదిక గురించి, ప్రబోధానంద యోగీశ్వరుని గురించి, పుస్తకాల గురించి పలు వ్యాసాలు రాశారు.
- తెలుగు వికీసోర్సులో పుస్తకాలు చేర్చి, వాటిని డిజిటైజ్ చేయసాగారు.
- తెవికీపీడియన్లు ఈ వ్యాసాల విషయ ప్రాధాన్యత గురించి చర్చించి చాలా వ్యాసాలను విషయ ప్రాధాన్యత లేదంటూ తొలగించారు.
- ఇందుశ్రీ ఉషశ్రీ ఒక్కరూ వికీసోర్సులో పుస్తకాల పని, వికీపీడియాలో వ్యాసాల మెరుగుదల దిద్దుబాట్లు సాగించారు.
లక్ష్యాలు
[మార్చు]- ఇందూ జ్ఞాన వేదిక సభ్యుల్లో ఆసక్తి ఉన్నవారికి విజ్ఞాన సర్వస్వ శైలి, వార్తా శైలి, ప్రచార శైలి, ఫీచర్ల శైలి వంటి పలు రచనా శైలుల గురించి అవగాహన కల్పించడం
- పుస్తకాల గురించి రాసేందుకు అంతర్జాలంలో ఉన్న పలు ఇతర వేదికలు, తిరస్కరణకు గురికాకుండా వాటిలో రాయడానికి తగిన పద్ధతులు వివరించడం.
- గతంలో ప్రారంభించిన భాగస్వామ్యానికి గౌరవప్రదమైన, సరైన ముగింపు కల్పించడం
కార్యక్రమ నివేదిక
[మార్చు]కార్యక్రమంలో ఇందుశ్రీ ఉషశ్రీ సహా ఐదుగురు ఇందు జ్ఞాన వేదిక సభ్యులు పాల్గొన్నారు. పాల్గొన్న సభ్యులు ఈ అంశాల గురించి నేర్చుకున్నారు:
- తెలుగు వికీపీడియాలో నిష్పాక్షికత, నోటబిలిటీ నిబంధనలు. నిర్వహణా పరంగా తీసుకునే చర్యల వెనుక సదుద్దేశం.
- తెలుగులో పలు అంతర్జాల వేదికలు, వాటి ఉద్దేశాలు, వాటిలో రాసే శైలి.
- సాధారణంగా వ్యాసాల రచనలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు:
- ప్లాట్‌ఫాం నిబంధనలు, లక్ష్యాలు
- పాఠకులు
- వీటికి అనుగుణంగా విషయాన్ని మలవాల్సిన తీరు