Jump to content

వికీపీడియా:సమావేశం/గ్రంథాలయాధికారులకు వికీ అకాడమీ/నివేదిక

వికీపీడియా నుండి

గ్రంథాలయాధికారులకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఎన్.ఇ.ఆర్.టి.యు.లో వికీ అకాడమీ జరిగింది. కార్యక్రమంలో వికీపీడియా-గ్రంథాలయాలు అంశంపై పవన్ సంతోష్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికీపీడియాతో ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రసిద్ధ గ్రంథాలయాలు ఎలా పనిచేస్తున్నాయో, తెలుగు వికీపీడియా వైపు నుంచి గ్రంథాలయాలు-కాటలాగుల అంశాల్లో జరుగుతున్న కృషి వంటి విషయాలను తెలియజేశారు. వికీపీడియా-గ్రంథాలయాలు పరస్పరం సహకరించుకోగల ప్రాజెక్టులు, ప్రయత్నాలను సోదాహరణంగా తెలుపుతూ వివరించారు. కాపీహక్కుల పరిధిలో లేని పుస్తకాలను డిజిటైజ్ చేయడం, కాటలాగుల్ని సీసీ బై ఎస్.ఎ. లైసెన్సులో విడుదల చేసి వికీలో చేర్చడం, వికీలో రాసే వారికి గ్రంథాలయాన్ని అందుబాటులో ఉంచే ఈవెంట్లు వంటివాటిని గురించి చర్చించారు. ఈ నేపథ్యంలో గ్రంథాలయాధికారులు, గ్రంథాలయ సంఘం నాయకులు ఐన పలువురు ఈ అంశంపై ప్రశ్నించి చర్చించారు. ఆపైన మరో సెషన్లో, సభ్యులతో వికీపీడియాలో అక్కౌంట్లు తెరిపించి వారితో రాయించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికీపీడియాలో రాసే పద్ధతులు, రిఫరెన్సులు అందించే విధానాలు వంటి అనేకాంశాల గురించి వారికి ప్రయోగాత్మకంగా నేర్పించారు. కొందరు సభ్యులు వ్యాసాలు సృష్టించగా, మరికొందరు ఉన్న వ్యాసాల్లో సమాచారాన్ని చేర్చడం నేర్చుకున్నారు. సభ్యులు వికీకామన్స్ లో ఫోటోలు చేర్చడాన్ని నేర్చుకున్నారు (పలువురు గ్రంథపాలకులు చారిత్రిక ప్రశస్తి కలిగి, ప్రస్తుతం ప్రాముఖ్యత కల తమ గ్రంథాలయాల ఫోటోల తీసి కామన్స్ లో చేర్చే ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు). ఈ సందర్భంగా తెలుగు వికీపీడియన్లు భాస్కరనాయుడు, గుళ్ళపల్లి, ప్రణయ్ రాజ్, సీఐఎస్-ఎ2కె ఉద్యోగి పవన్ సంతోష్ పాల్గొన్నవారికి సహకరించారు.

పాల్గొన్నవారు

[మార్చు]
  1. వివేకవర్థన్ (చర్చ) 08:58, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. జి. సరోజ (చర్చ) 09:47, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. నాగలక్ష్మణ్ (చర్చ) 09:48, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ఎస్.ఎస్. రావు (చర్చ) 09:4, 11 జనవరి 2016 (UTC)
  5. రాధికారాణి బండారి (చర్చ) 09:52, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6. కిషన్ (చర్చ) 09:55, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7. వి. లలిత (చర్చ) 09:55, 11 జనవరి 2016
  8. పి. దివాకర్ (చర్చ) 10:15, 11 జనవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  9. వాడుకరి:Esveesru
  10. అచల మునిగళ్

ఫలితాలు

[మార్చు]

సృష్టించిన వ్యాసాలు

[మార్చు]
  1. గుండు చెరువు, వరంగల్
  2. బాలల సాహిత్యం - దారిమార్పు పేజీగా ఉన్న వ్యాసం తొలగించి, కొత్త వ్యాసం సృష్టించారు.
  3. దళిత సాహిత్య నేపథ్యం

ప్రస్తుత వ్యాసాల అభివృద్ధి

[మార్చు]
  1. డోర్నకల్లు
  2. ఉస్మానియా విశ్వవిద్యాలయము
  3. ఎస్వీ సత్యనారాయణ

చేర్చిన దస్త్రాలు

[మార్చు]
  1. File:S.V.Satyanarayana.jpg
  2. File:Dome of Arts College, Osmania University.jpg