Jump to content

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాల/వ్యక్తిగత కార్యశాలలు/Malladi kameswara rao

వికీపీడియా నుండి

అంశాలు - సూచనలు

[మార్చు]
మూలాలు చేర్చడం
  • వికీపీడియా వ్యాసాల్లో మూలాలు చేర్చడానికి ఉపయోగించదగ్గ సైటేషన్ మూసలు ఉన్నాయి. మనం ఏదైనా వాక్యం లేదా, పేరాను ఫలానా మూలం నుంచి తీసుకుని రాశామని సూచించడానికి ఈ సైటేషన్ మూసలతో రాసే పద్ధతి పనికి వస్తుంది. ఈ కింది సూచనలన్నీ వికీ టెక్స్ట్ మోడ్ లో వాడుకోవాలి.
  • వార్తా పత్రికల నుంచి స్వీకరిస్తే: <ref name="">{{cite news |author= |date= |title= |newspaper= |location= |publisher= }}</ref> ఇది కాపీ చేసుకుని, దీంట్లో author= అన్నదగ్గర రచయిత పేరు (ఉంటే రాయండి, లేకుంటే ఖాళీగా వదలండి), date వద్ద తేదీ, title వద్ద వ్యాసం లేక వార్త శీర్షిక, newspaper వద్ద పత్రిక పేరు, లొకేషన్ వద్ద ప్రచురితమైన స్థానం, పబ్లిషర్ వద్ద పబ్లిషర్ వివరాలు ఇచ్చి పూర్తిచేయండి. ref name అన్న దగ్గర కొటేషన్లలో ఆ రిఫరెన్సుకు సులువుగా గుర్తించగలిగే పేరు ఏదైనా పెట్టుకోండి. ఉదాహరణకు "గుణసుందరి కథ గురించి ఈనాడు సినిమాలో" అని పెట్టుకోవచ్చు. ఇది బయటకు కనిపించదు. దీని అవసరం ఏమన్నది ఒకే మూలాన్ని అదే వ్యాసంలో మళ్ళీ వాడడం అన్న పాయింటులో చూద్దురు గానీ. ఒకవేళ వ్యాసానికి ఇంటర్నెట్లో నిలబడే లింకు (ఉదాహరణకు ఈనాడు పత్రిక వార్తాకథనాలు 90రోజుల్లో మాయమైపోతాయి, కొన్ని పత్రికలవి స్టాటిక్ గా ఉంటాయి) ఉందనుకోండి. ఆ లింకును <ref name="">{{cite news |author= |date= |title= |url= |newspaper= |location= |publisher= |accessdate=}}</ref> అన్న మూస తీసుకుని, దాంట్లో url అన్నదగ్గర ఇవ్వండి, acessdate అన్నదగ్గర మీరు ఏరోజైతే ఆ లింకును ఇస్తున్నారో ఆ తేదీ ఇవ్వాలి. (ఎందుకంటే భవిష్యత్తులో url dead link అయిపోతే ఏరోజున లైవ్ గా ఉందో తోటివారికి తెలియడానికి)
  • పుస్తకం నుంచి తీసుకుంటే: <ref name="">{{cite book |author= |date= |title= |url= |location= |publisher= |page= |isbn= |accessdate= }}</ref> పుస్తకం నుంచి తీసుకున్నట్టైతే ఈ మూసలో రచయిత పేరు author వద్ద, తొలి ముద్రణ తేదీ date వద్ద, పుస్తకం పేరు title వద్ద, ఇంటర్నెట్లో పుస్తకం దొరుకుతూంటే url (ఇది ఉంటేనే accessdate నింపాలి, కారణం పైన పాయింట్లో ఇచ్చాను), ప్రచురణ అయిన ప్రదేశం పేరు location, ఏ పేజీ నుంచి మీరు సమాచారం తీసుకున్నారో అది రాయడానికి page (ఒకవేళ రెండు మూడు పేజీలైతే page అన్నది pages గా మార్చుకుని 3-5 లేదా 3,4 అన్న పద్ధతిలో పేజీ నెంబర్లు ఇవ్వండి), ఐ.ఎస్.బి.ఎన్. నెంబరు ఉంటే isbn "=" తర్వాత నింపాలి. ఏదైనా తొలగించాలంటే దాని పక్కన ఉన్న "= |" సహా తీయకపోతే మూస బ్రేక్ అయిపోతుంది. ఇక పుస్తకం పేరు మినహా ఏ ఇతర వివరాలైనా లేకపోతే వదిలెయ్యొచ్చు. కానీ రాయడానికే ప్రయత్నించండి. పేజీ నంబరుతో సహా రాస్తే చదివేవారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
  • మేగజైన్ నుంచి తీసుకుంటే: పైన వార్తాపత్రికల విషయంలో చేసినట్టే <ref name="">{{cite magazine |last= |first= |date= |title= |url= |magazine= |location= |publisher= |access-date= }}</ref> అన్నది నింపి వాడుకోవచ్చు.
  • ఒకే మూలాన్ని అదే వ్యాసంలో మళ్ళీ వాడడం: ఒక పత్రికా వార్త నుంచి పలు అంశాలు తీసుకుని ఒకే వికీపీడియా వ్యాసంలోని వేర్వేరు పేరాల్లో వాడుకున్నాం అనుకుందాం. దాన్ని పైన చెప్పినట్టు వార్తా పత్రిక మూలం మూసలో నింపి వాడాం, మళ్ళీ కింద మరో పేరాలో దాన్నే వాడాలంటే ఏం చేయాలి? పైన మూసను మళ్లీ పేస్టు చేయాలా? అక్కరలేదు. <ref name=""> అని మొదట్లో వచ్చినచోట కొటేషన్ల మధ్యలో ఆ మూలానికి ఏదోక పేరు పెట్టండి. ఉదాహరణకు గుణసుందరి కథ సినిమా గురించి ఈనాడులో ఓ వ్యాసం పడింది, దాన్ని వాడుకుంటున్నాం అనుకుందాం "గుణసుందరి కథ గురించి ఈనాడు సినిమాలో" అని పేరుపెట్టుకోవచ్చు. కింద మరోచోట మీరు అదే మూలాన్ని వాడుకోవాల్సి వచ్చినప్పుడు <ref name= "గుణసుందరి కథ గురించి ఈనాడు సినిమాలో" /> అన్నది పేస్టు చేస్తే మరోసారి వస్తుంది.
  • ఈ మూలాలు ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి: ఈ మూలాలు వ్యాసం అడుగున మూలాలు అన్న విభాగంలో కనిపించాలి. అలా రావాలంటే మనం {{మూలాలజాబితా}} అన్న మూసను పేస్ట్ చేయాలి.

సందేహాలు

[మార్చు]

ఒక్కసారి ప్రయత్నించి ఏదైనా సందేహం ఉంటే ఈ కింద రాయండి