Jump to content

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాల

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా నాణ్యత అభివృద్ధి లక్ష్యంగా వికీపీడియాలో ఇప్పటికే రాస్తున్న సభ్యులకు నిర్వహిస్తున్న కార్యశాల.

ఉద్దేశాలు, లక్ష్యాలు

[మార్చు]
  • తెలుగు వికీపీడియాలో ఆమోదించుకున్న విధానాలు, ప్రత్యేకించి శైలీపరంగా వికీపీడియన్లు ఇప్పటికే చేసిన నిర్ణయాలను గురించి అవగాహన పెంపొందించి వాటి అమలుకు తోడ్పడడం
  • తెలుగు వికీపీడియాలో పూర్తిస్థాయిలో శైలి ఏర్పడేందుకు ఏయే విధానాలు, మార్గదర్శకాలు లోపిస్తున్నాయో గుర్తించడం, తద్వారా వాటిని ఆన్-వికీ చర్చించేందుకు వీలివ్వడం
  • తెవికీ వ్యాసాల నాణ్యత మెరుగుపరిచే ప్రయత్నాలు చేయడం

కార్యక్రమ వివరాలు

[మార్చు]
  • తేదీ: 2018 జూన్ 24, ఆదివారం
  • సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు
  • ప్రదేశం, వేదిక: CR-1, నీలగిరి బ్లాక్, ఐఐఐటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ (గూగుల్ మ్యాప్స్ లింకు)
  • నిర్వహణ: పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)
  • నిర్వహణ సహకారం: జోయల్ వినయ్ కుమార్, ప్రణయ్ రాజ్ వంగరి
  • రీసోర్స్ పర్సన్లు: పవన్ సంతోష్‌, టిటో దత్తా, వెలగా కృష్ణచైతన్య
  • అవుట్‌రీచ్ డాష్‌బోర్డు: ఇక్కడ

అజెండా అంశాలు

[మార్చు]
  • తెలుగు వికీపీడియాలో ఇప్పటికే ఆన్ వికీ చర్చల ద్వారా ఆమోదించిన విధానాలు, మార్గదర్శకాలను విశదీకరించడం, హ్యాండ్స్-ఆన్.
  • వికీపీడియా శైలి పూర్తిస్థాయిలో ఏర్పరుచుకునేందుకు ఇప్పటికి ఉన్న విధానాలు, మార్గదర్శకాలకు పైన మరి వేటిపై చర్చలు ప్రారంభించాలన్నది గుర్తింపు.
  • ప్రదర్శిత వ్యాసాలతో కూడిన చదవగ్గ వ్యాసాల జాబితాలోని వ్యాసాల్లో నాణ్యతాపరంగా సమీక్ష. ఈ కింది అంశాలు ప్రతిపాదించబడ్డాయి.
    • మూలాల సమస్య
    • వికీపీడియా:శైలి
      • వ్యాస పరిచయం లేమి
      • గౌరవార్థకాలు వినియోగం, విజ్ఞాన సరస్వస్వ శైలికి విరుద్ధమైన ప్రయోగాలు
      • తదితరాలు
    • భాషా శైలి
      • వ్యాకరణ సమస్యలు
      • అక్షరదోషాలు
      • గ్రాంథిక ప్రయోగాలు
    • వికీపీడియా నాణ్యతా ప్రమాణాలు
      • అనాథ పేజీలు
      • అగాథ పేజీలు
  • సమీక్ష అనంతరం ఆయా పేజీల్లో ఎక్కువగా కృషిచేసినవారి దృష్టికి నాణ్యతాపరమైన సమస్యలు తీసుకువచ్చేలా చర్చ పేజీల్లో మూసలు చేర్పు.
  • నాణ్యతాభివృద్ధికి తగిన ప్రణాళికపై చర్చ

పాల్గొనేవారు

[మార్చు]
  • తెలుగు వికీపీడియాలో అనుభవం ఉన్న వాడుకరులు

ముందస్తు నమోదు

[మార్చు]
  1. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:24, 19 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  2. యర్రా రామారావు (Talk2Me|Contribs)
  3. --Nrgullapalli (చర్చ) 15:10, 23 జూన్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నివేదిక

[మార్చు]

గమనిక: కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా ఈ అంశాలు నేర్చుకునేందుకు తనకు ఉత్సాహం ఉందనీ, రానివారికి సైతం సారాంశం తెలిసేలా నివేదిక రాయమని సూచించిన భాస్కరనాయుడు గారికి ధన్యవాదాలు. ఈ నివేదిక రాయడంలో ఆయన సూచన సాధ్యమైనంతవరకూ పాటించాను. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:19, 26 జూన్ 2018 (UTC), కార్యక్రమ నిర్వాహకుడు[ప్రత్యుత్తరం]

కార్యక్రమానికి Adbh266, యర్రా రామారావు, Ramesam, Nrgullapalli హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. పవన్ సంతోష్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ నాణ్యతాభివృద్ధి సమావేశం లక్ష్యాలు, ఉద్దేశం వివరించారు.

పాఠకులకు వికీపీడియా నుంచి ఊరించే శైలి అక్కరలేదు

రచన ఎలా అందంగా తీర్చి దిద్దాము అనేదానికంటే,
అది ఎంత స్పష్టంగా, సమాచార సహితంగా, పక్షపాత రహితంగా
ఉంది అనేది ముఖ్యం.

తెలుగు వికీపీడియా శైలి మార్గదర్శకాలు

తెలుగు వికీపీడియా శైలిని, తరచుగా సభ్యులు చూసే పత్రికల శైలితో పోల్చిచెప్పారు. పత్రికలు తమ పాఠకులు దారినపోతూన్నా శీర్షిక ఆకర్షించి పత్రిక పట్టుకునేలా చేయాలనీ, ఆపైన లీడ్ సెక్షన్‌గా పిలిచే తొలి 2-3 పేరాల్లో విషయాన్ని చెప్పీ చెప్పకుండా ఆసక్తి కలిగించి మందుకు తీసుకుపోవాలనీ, ఆపైనే విషయంలోకి వస్తూ సమాచారాన్ని, విషయాన్నీ, విశ్లేషణను అందిస్తాయని చెప్పారు. పత్రికల శైలిలో ఒక ప్రధానాంశం చివరిదాకా చదివించడమని పేర్కొన్నారు. అందుకు భిన్నంగా వికీపీడియాలోకి పాఠకుడే ఏదోక సమాచారం కోసం పనిగట్టుకుని (తరచు సెర్చింజన్‌ ద్వారా) వస్తాడని, వికీపీడియా నుంచి పాఠకులు ఆకర్షించి, ఊరించే శైలి కోరుకోరని తెలిపారు. ఆ వచ్చిన పాఠకుడికి అతికొద్ది సమయం ఉంటే లీడ్‌లో తొలి వాక్యం, సమాచారపెట్టెలో ఉన్న వివరాలు తెలుసుకుని వెళ్ళిపోయే వీలుండాలనీ, ఆపైన మరికొంత సమయం ఉంటే ప్రవేశిక లేక లీడ్‌ సెక్షన్ అని పిలిచే మొదటి 2-4 పేరాల సమాచారాన్ని చదువుకుని వ్యాసం సారాంశాన్ని ఆకళింపు చేసుకుంటాడని, మరింత ఆసక్తి, అవసరం, సమయం ఉంటేనే వ్యాసం అంతా చదివి విషయంలోని పలు అంశాలను తెలుసుకుంటాడని చెప్పారు. మరింత లోతుగా పరిశోధించదలిచినవారికి కింద ఇచ్చిన బయటి లింకులు, వ్యాసం రాయడానికి ఉపయోగపడిని ఉపయుక్త గ్రంథాలు, మూలాలలోకి వెళ్ళి చదువుకునేందుకు వీలుండాలని అన్నారు. ఇలా పాఠకులు ఆశించేది, పాఠకుల నుంచి పత్రిక/విజ్ఞాన సర్వస్వం ఆశించేది కూడా భిన్నంగా ఉంటాయని తెలిపారు. ఇందుకే పత్రికలకు భిన్నంగా వికీపీడియాలోని వ్యాసాల్లో మొదటి వాక్యమే వ్యాసం గురించిన తగిన సమాచారం అందించేదిగా, మొదటి కొన్ని పేరాలు మొత్తం విషయానికి క్లుప్తమైన సారాంశంగా రాయాలన్న నియమం వచ్చిందన్నారు.

స్పష్టంగా ఉండాలి, పక్షపాత రహితగా ఉండాలి

వికీపీడియాలో శైలి నియమాలు రూపొందడంలో నిష్పాక్షికత, ప్రామాణిక వ్యవహారిక భాష, విజ్ఞాన సర్వస్వ తరహా అన్న మూడు కీలకమని తెలిపారు. నిష్పాక్షికతను అనుసరించి ఏకవచన స్వీకారం జరిగిందని అందుకు అనుగుణంగా చేశాడు, చేసింద, అతను, ఆమె ఉపయోగించాలనీ చెప్పారు. అద్వితీయం, అద్భుతం, అపురూపం లాంటి బోలు పదాలను వాడకూడదనీ అంతగా అవసరమైతే అలాగని ఎవరైనా పరిశోధకులు, ఆ రంగంలో ప్రామాణికులు అనివుంటే వారిని ఉదహరిస్తూ రాయాలని సూచించారు. వ్యక్తిగతంగా రచయితలు రాసేదాన్ని పక్కన పెట్టినా పత్రికల్లో క్రీడాకారులు, సినీతారల విషయంలో చేశాడు అనీ, ఇతర రంగాల వారికి చేశారు అనీ, 30లలోపు యువకులు, పిల్లల విషయంలో డు, పెద్దవారి విషయంలో రు వాడతారనీ, ఇటువంటి వివక్ష తెలుగు వికీపీడియాలో లేకుండా అందరినీ సమానంగా ఏకవచన స్వీకారం జరిగిందని చెప్పారు. ఈ ఏకవచన ప్రయోగం అన్నది విషయపు పేజీలకే కానీ చర్చలు, వికీపీడియా పేరుబరి పేజీల్లో వర్తించదనీ, ఎందుకంటే విషయం పేజీల్లో సంతకం లేకుండా వికీపీడియా నుంచి అనివుంటుంది కాబట్టి విచక్షణ, వివక్ష తగదని, వ్యక్తులుగా వికీపీడియన్లు చర్చల్లో వారికి గౌరవప్రదమనిపించిన రీతిలో రాయవచ్చని తెలిపారు. ప్రామాణిక వ్యవహారిక భాషకు విరుద్ధంగా "యొక్క", "మరియు"లను ఆంగ్లంలోని And, Of పదాలకు సమానార్థకంగా వాడడం కనిపిస్తోందని ఇది సరికాదనీ, అలాగే గ్రాంథిక భాషా శైలిలోని -ము బదులుగా పూర్ణానుస్వరం (ఉదాహరణకు విశ్వము బదులు విశ్వం అని రాయాలి, దేశములు బదులు దేశాలు రాయాలి) వాడాలని సూచించారు. తేదీ ఆకృతి సంవత్సరం-నెల-తేదీ అన్న రీతిలో ఉండాలని (ఉదాహరణకు 2018 జూన్ 24న అని రాయాలి) దీన్ని తెలుగువారు సాధారణంగా తేదీని పలికే పద్ధతిగా భావిస్తూ స్వీకరించామని చెప్పారు.