వికీపీడియా:Contact us/Article subjects
|
Hi, Your website is not ranking well on Google. I can help you in putting your website on the Google's top-3 Rank and getting more customers Guaranteed. Would you like to me seo proposal your business site I can send over a detailed proposal with affordable packages. Warm regards, Nikita
|
మీ గురించో మీ సంస్థ గురించో ఉన్న వ్యాసం అసంపూర్తిగా ఉందని గానీ, సరిగా లేదని గానీ, పక్షపాతయుతంగా ఉందని గానీ మీరు భావిస్తే, దాని గురించి వికీపీడియా సంపాదకీయ సంఘంతో చర్చించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వికీపీడియాలో కేంద్రీకృతంగా ఒక రచయితో లేదా కంటెంట్ సమీక్షకుడో లేరు. మా కంటెంట్‌ను అనేకమంది సంపాదకులు స్వచ్చందంగా నిర్వహిస్తూంటారు. మీ వ్యాసంలో దిద్దుబాట్లు చేస్తున్నవారిని గాని పర్యవేక్షిస్తున్నవారిని గానీ సంప్రదించడం బహుశా అత్యుత్తమమైన మార్గం. వ్యాసపు "చర్చ" పేజీలో మీ సమస్యలను వివరిస్తూ ఒక గమనికను ఉంచితే, మీ వ్యాసాన్ని దిద్దుబాటు చేసే వారిని లేదా పర్యవేక్షించే వారిని సంప్రదించవచ్చు. వ్యాసానికి ఎగువన ఉన్న "చర్చ" లింకును నొక్కి ఈ పేజీకి వెళ్ళవచ్చు. అక్కడకు చేరుకున్న తర్వాత, దాని కుడి వైపున ఉన్న "అంశాన్ని చేర్చు" అనే టాబును నొక్కండి. ఇది చర్చ పేజీలో ఒక క్రొత్త విభాగాన్ని సృష్టిస్తుంది. అక్కడ మీరు మీ సమస్యను లేదా వ్యాఖ్యలను రాయవచ్చు. పేజీలో మీరే నేరుగా దిద్దుబాటు చేసేందుకు అడ్డుగా ఉన్న "మీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్టు"ను సూచించేందుకు ఆ క్రొత్త విభాగంలో పైన {{request edit}} అనే మూసను పెట్టి, మీరు సూచిస్తున్న సవరణలు చెయ్యమని అభ్యర్థించండి. ఆ తరువాత "మార్పులను ప్రచురించు" నొక్కండి. వెంటనే ఆ పేజీలో మీ క్రొత్త విభాగం చేరుతుంది. చర్చ పేజీలో ఇలా సందేశం పెట్టినా ప్రయోజనం కనిపించక పోతే, మీరు సహాయ కేంద్రంలో అడగవచ్చు. ఈ పేజీని వికీ ఎడిటర్లు మరింత తరచుగా చూస్తూంటారు. ఇవి కాకుండా, info-en-q మీకు సంబంద్గించిన వ్యాసంలో వాడేందుకు ఫొటోలను గానీ, మీ స్వరాన్ని రికార్డు చేసిన ఆడియో ఫైలును గానీ విరాళమివ్వదలిస్తే దాన్ని నేరుగా మీరే వికీపీడియా కామన్సు లోకి ఎక్కించి, ఆ పైన మీరే మీ వ్యాసం లోకి చేర్చవచ్చు. లేదా, photosubmission
|
