వికీపీడియా చర్చ:తెవికీ దశాబ్ది ఉత్సవాలు-Tewiki 10th Anniversary/Committee

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెవికీ దశాబ్ది ఉత్సవాలను విజయపథం వైపుకు నడిపిస్తున్న నిర్వాహక మండలి, సహాయక మండలి, కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార ఎంపిక మండలి లకు హృదయపూర్వక అభినందనలు. పురస్కార విజేతలను, ప్రశంసాపత్రాల విజేతలను ఎంపిక చేయడంలో ప్రదర్శించిన పారదర్శకత, వికీ విధానాల మరియు ఎంపిక విధానాల చక్కటి అవలంబన, తీసుకున్న జాగ్రత్తలు ఆహ్వానింపదగ్గవి. మరీ ముఖ్యంగా మూల్యాంకనా విధానం మరియు దాని ఆధారంగా విజేతలను ఎంపిక చేసే పద్దతి అందరినీ ఆకట్టుకున్నది. ఈ విధానం మిగతా సభ్యులకు ప్రోత్సాహాన్ని మరియు స్పూర్తినిస్తుందని, తెవికీలో రచనా వేగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను. మరొక సారి ఎంపిక మండలిని అభినందిస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 19:09, 28 డిసెంబర్ 2013 (UTC)