వికీపీడియా చర్చ:నమ్మదగ్గ మూలాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్లాగుల నిషేధం గురించి[మార్చు]

కొన్ని బ్లాగులు పత్రికలు కానీ (ఉదాహరణకు టైమ్స్ ఆఫ్ ఇండియా బ్లాగ్, బీబీసీ బ్లాగ్), సంస్థల బ్లాగులు కానీ (ఉదాహరణకు గూగుల్ బ్లాగ్, వికీమీడియా ఫౌండేషన్ బ్లాగ్) స్వంతంగా ప్రచురించేవి కానప్పుడు, వాటిపై పూర్తిగా సంపాదకుల నియంత్రణ ఉన్నప్పుడు, రచయితలు ఆయా అంశంలో నిపుణులు, అధ్యయనపరులు అయినప్పుడు మాత్రమే బ్లాగ్‌ని అంగీకరించవచ్చని ఆంగ్ల వికీపీడియా మార్గదర్శకం. ఇవి బ్లాగులుగా పిలవబడుతున్నా సంప్రదాయరీతిలో ఇవి స్వయం ప్రచురణ సాధనాలు కావన్న ఉద్దేశంతో చేశారు. అయితే సంస్థ అన్నప్పుడు, పత్రిక అన్నప్పుడు చిన్నా చితకా సంస్థ నుంచీ మొదలుకొని అన్నిటి బ్లాగులను ఉపయోగించే ప్రమాదం ఉంది. తద్వారా నాణ్యత తగ్గుదలకు మార్గదర్శకాల్లోనే ఒక వీలిచ్చినట్టు అవుతుంది.
సంస్థలు, పత్రికల బ్లాగులను వాటి స్థాయిని బట్టి, నాణ్యతని బట్టి విడివిడిగా వాలిడైట్ చేస్తూ, అంగీకరించదగ్గ బ్లాగుల జాబితా ఒకటి తయారుచేసుకోగలిగినంత నిర్వాహక సామర్థ్యం ఏర్పడేంతవరకూ ఈ బ్లాగులను వదిలివేయడం తప్పట్లేదు. భవిష్యత్తులో అలాంటి స్థాయికి వచ్చినప్పుడు ఈ అంశంపై చర్చించి సముదాయంలో నిర్ణయించుకుని, జాబితా నిర్వహణ చేసుకుంటూ సాగుతారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 06:02, 11 జూలై 2018 (UTC)