వికీపీడియా చర్చ:5 నిమిషాల్లో వికీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చర్చ పేజీలో మీ అభిప్రాయాలను, సూచనలనూ, వ్రాయండి. సంతకం పెట్టటం మరవకండి.

శ్రీసింహ[మార్చు]

అందరికీ శ్రీసింహుని నమస్కారం!

హ్యాప్పీ న్యూ ఇయర్ 2007[మార్చు]

ఈ నూతన సంవత్సరం అందరికీ శుభమ్ కలుగజేయాలని ఆశిస్తూ! పార్ధ సారధి * విశాఖ.

రాయటం vs. వ్రాయటం[మార్చు]

మీ అభిప్రాయాలు? Alamandrax 06:50, 20 ఫిబ్రవరి 2007 (UTC)

 • ఇది ఒక ఉదాహరణ జవాబు మాత్రమే. Alamandrax 06:51, 20 ఫిబ్రవరి 2007 (UTC)
 • ఇప్పుడు రెండూ ఉపయోగిస్తున్నారనుకుంటా --వైఙాసత్య 17:27, 20 ఫిబ్రవరి 2007 (UTC)
 • వ్రాయటం మాత్రమే సరియైనది, -- santosh 10:47, 16 ఫిబ్రవరి 2008 (UTC)
 • ఇపుడు రెండూ వాడుకలో ఉన్నాయి....ఏదైనా రా(వ్రా)సుకోవచ్చు...:) -- త్రైలింగ

దుశ్చర్య - జాగ్రత్త[మార్చు]

11:48, 2 మే 2007ని 193.65.1.130 ఐ.పి.అడ్రసు నుండి ఒకరు ఈ వ్యాసంమొత్తాన్ని చెరిపివేసి "learn english fucking noobs, dont try to make a wannabe language from some preschool kids doodles" అని వ్రాశారు. ఈ వ్యాసాన్ని వెనుకకు తీసికొని వెళుతున్నాను. నిర్వాహకులూ! ఈ మధ్య ఇలాంటి దుశ్చర్యలు ఎక్కువౌతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. --కాసుబాబు 14:41, 2 మే 2007 (UTC)

ఇక సహాయాన్ని వినిపిద్దాం[మార్చు]

సహాయం వ్యాసాలన్నిటినీ ఆడియో ఫైళ్ళుగా తయారుచేసి పెడితే కొత్తవారికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశ్యం. మాటలబాబు గారు ఇప్పటికే ఓ

తయారుచేసి, మొదటి అడుగు వేసారు. ఆ పద్ధతిలో.. ఈ వ్యాసం లోని ప్రధాన భాగాలను ఒక్కో .ogg ఫైలుగా తయారు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశ్యం. అంటే ఈ వ్యాసం మొత్తం కింది ఫైళ్ళుగా తయారు చెయ్యొచ్చు. అయితే ఆడియో ఫైలులో వ్యాసాన్ని యథాతథంగా చదవకుండా మరింత విపులంగా చదవవచ్చనుకుంటాను.

 1. ఎడమవైపున ఉండే లింకులు
 2. పేజీ గురించి
 3. నేం స్పేసులు
 4. ఎలా వ్రాయాలి
 5. మూసలు, వర్గాలు
 6. సభ్యత్వం
 7. వికీ విధానాలు
 8. వికీ రచనా శైలి

సభ్యులు సలహాలు ఇవ్వగలరు. __చదువరి (చర్చరచనలు) 05:19, 4 జూన్ 2007 (UTC)

బ్రౌజర్[మార్చు]

నేను నా బ్రౌజర్ లో విన లేక పోతున్నాను. జావా ఉంది, అప్ టు డేట్ అని చెబుతోంది కాని బ్రౌజర్ ప్లేయర్ మాత్రం పని చేయడం లేదు.--మాటలబాబు 15:37, 6 జూన్ 2007 (UTC)

నాకూ అదే సమస్య కానీ నేను ఇక్కడి నుండి ఓగ్ కోడెక్స్ ఫర్ విండోస్ ఇన్స్‌టాల్ చేసుకున్నా. ఇప్పుడు మీడియా ప్లేయర్లో మీ గళాన్ని వింటున్నాను. భలే మంచి ప్రయత్నం. శెభాష్ --వైఙాసత్య 15:45, 6 జూన్ 2007 (UTC)
మాటలబాబు! బాగా చేసారు. అది నాకూ బ్రౌజరులో పనిచెయ్యలేదు. డౌనులోడు చేసుకుని విన్నాను. వ్యాసంలో కొన్ని తప్పులుండడం వలన మీకు అక్కడక్కడ ఇబ్బందులెదురైనట్టు గ్రహించాను. కొన్ని సరిచేసాను. తీరుబడిగా మిగతా భాగం కూడా విని అవసరమైన మార్పుచేర్పులు చేస్తాను. నాదో సూచన.. పేజీ మొత్తాన్ని ఒకే ఫైలులాగా కాక, విడివిడి ఫైళ్ళుగా చేస్తే బాగుంటుందనుకుంటా.. డౌనులోడు తేలికగా అవుతుంది, భవిష్యత్తులో మార్పు చేర్పులు చెయ్యాల్సివస్తే తేలికవుతుంది. ఇక ముందు చేసేవి అలా చేద్దాం. గొంతు మీదేనా? మృదువుగా ఉంది. మీ స్పూర్తితో నేనూ ఒకటి ప్రయత్నిస్తాను. __చదువరి (చర్చరచనలు) 16:05, 6 జూన్ 2007 (UTC)
చదువరి గారికి, నేను పెద్దగా చేసినది ఏమి లేదు. అంతా మీ స్పూర్తే, మీరు ఇచ్చిన ఆలొచననే నేను ఆచరణలో పేట్టాను. అయినా ఆ ఆడియౌ ఫైలు చాలా మెరుగు పరచవలసి ఉంది. నేను అ వ్యాసాన్ని విభగాలుగా రికార్డు చేసి చివరికి కలిపాను. ఆంగ్ల వికీ లొ కొన్ని ఆడియౌ ఫైల్సు విని ఇది రికార్డు చేశాను. అక్కడ మెత్తం వ్యాసాన్ని వినిపించారు. 20 నిమిషాలు. ఏదైన అంత మిరిచ్చిన ఆలొచనే..ఇంకా ఏ ఏ వ్యాసాలు అడియౌ ఫైల్సు గా చెయ్యచ్చో ఆలొచించాలి. వైజా సత్యా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు శ్రవణ మూస చేసినందుకు.. --మాటలబాబు 19:45, 6 జూన్ 2007 (UTC)


సహాయం కోరిన సభ్యులు[మార్చు]

జ్ఞాన ప్రసూన గారు రిజిస్టర్ చేసుకొన్నారు గాని పేరు కనిపించడంలేదని ఈ వ్యాసం పేజీలో వ్రాశారు. అభ్యుల లాగ్‌లో నాకు అటువంటి పేరు కనిపించలేదు. మీరు మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:46, 25 జూన్ 2008 (UTC)