విచిత్రప్రేమ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విచిత్రప్రేమ
(బాబ్జీ)
దర్శకత్వం జంధ్యాల
నిర్మాణం ఎ. సూర్యనారాయణ
కథ భమిడిపాటి రాధాకృష్ణ
చిత్రానువాదం జంధ్యాల
తారాగణం రాజేంద్ర ప్రసాద్
సంగీతం రాజ్ - కోటి
సంభాషణలు జంధ్యాల
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీనారాయణ ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

విచిత్ర ప్రేమ 1991 లో వచ్చిన హాస్య చిత్రం. శ్రీ లక్ష్మి నారాయణ ఎంటర్ప్రైజెస్ పతాకంపై జంధ్యాల దర్శకత్వంలో A. సూర్యనారాయణ నిర్మించాడు.[1] ఇందులో రాజేంద్ర ప్రసాద్, అమృత ప్రధాన పాత్రల్లో నటించారు. కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[2]

ఇద్దరు ప్రాణస్నేహితులు సీతాపతి (సుబ్బరాయ శర్మ), మేజర్ ప్రతాపరావు (అభిషిక్త వర్మ) తమ పిల్లలు, శివుడు (రాజేంద్ర ప్రసాద్) పార్వతి (అమృత) లకు పెళ్ళి చెయ్యాలని వారి బాల్యంలోనే నిర్ణయించుకుంటూండగా ఈ చిత్రం ప్రారంభమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు, పిల్లలు శత్రుత్వంతో పెరుగుతారు, కాబట్టి, పెద్దలు వారిని వేరు చేస్తారు. 10 సంవత్సరాల తరువాత, వారు తెలియకుండానే కలుస్తారు. ఒక సంఘటన కారణంగా పార్వతి శివుడిని దొంగ అని తప్పుగా అర్ధం చేసుకుంటుంది. చివరికి, పెద్దలు వారి కలయికను ఏర్పాటు చేస్తారు. వారి మధ్య ఘర్షణ తలెత్తి అది ద్వేషంగా మారుతుంది. కాబట్టి, పెద్దలు వాళ్ళ పెళ్ళి వెంటనే చెయ్యాలని నిర్ణయించుకుని, బలవంతంగా ఏర్పాట్లు ప్రారంభిస్తారు. తప్పించుకోవడానికి శివుడు, పార్వతి తమ స్నేహితుడు బాబ్జీ (బ్రహ్మానందం) సహాయం తీసుకుంటారు. అతడు ఒక ఉపాయం చెబుతాడు. ఆ తరువాత, వారు వెంకట్రావు (సుత్తి వేలు) & కల్పన (జయలలిత) అనే కొద్దిమంది నాటక కళాకారులతో కలిసి ఒక నాటకాన్ని ఆడతారు. వాఉ తమతమ తల్లిదండ్రుల మధ్య ఉన్న స్నేహాన్ని విజయవంతంగా శత్రుత్వంగా మారుస్తారు. ఆ తరువాత, అనేక సత్యాలు బయటికి వస్తాయి. ఇది పార్వతి శివుడి ధర్మాన్ని గ్రహించేలా చేస్తుంది. ఇంతలో, పార్వతి మోసగాడు అవినాష్ (నవభారత్ బాలాజీ) ఉచ్చులో పడినపుడు శివుడు ఆమెను రక్షిస్తాడు. ఇక్కడ వారు నిజంగానే ప్రేమలో పడతారు. పెద్దలు ఇద్దరూ వాళ్ళపై విరుచుకుపడి, తెలియని వ్యక్తులతో పిల్లల వివాహాలను బలవంతంగా ఏర్పాటు చేస్తారు. చివరికి, శివుడు సత్యాన్ని బయటకు తెచ్చి పెద్దలను తిరిగి కలుపుతాడు. చివరగా, ఈ చిత్రం శివుడు పార్వతిల పెళ్ళితో ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

పాటలు

[మార్చు]
ఎస్. పాట పేరు గాయకులు పొడవు
1 "ఆరింటికి మొదలే అనురాగం" ఎస్పీ బాలు, చిత్ర 4:32
2 "మానస సంచరరే" ఎస్పీ బాలు, చిత్ర 3:54
3 "చిలుకు చేరా" ఎస్పీ బాలు, చిత్ర 4:31
4 "కలుసుకోని" ఎస్పీ బాలు, చిత్ర 4:08

మూలాలు

[మార్చు]
  1. "Vichitra Prema (Cast & Crew)". Bharat Movies.com. Archived from the original on 2016-06-30. Retrieved 2020-08-29.
  2. "Vichitra Prema (Review)". The Cine Bay. Archived from the original on 2021-09-21. Retrieved 2020-08-29.