విజ్ఞానజ్యోతి సాహితీ వనం
రకం | తెలుగు సాహిత్యం |
---|---|
స్థాపించిన తేదీ | 2013 జులై 22 |
స్థాపకులు | విజ్ఞానజ్యోతి టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాల |
ప్రధాన కార్యాలయం |
|
సేవా పరిధి | హైదరాబాద్ |
విజ్ఞానజ్యోతి సాహితీవనం విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, సాంకేతికతలకు సంబంధించి ఏర్పడిన ఒక విద్యార్థిసమితి.
ప్రారంభం
[మార్చు]విజ్ఞానజ్యోతి సాహితీవనం జులై 22, 2013న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎన్నో విభిన్నమైన కార్యక్రమాలతో, పోటీలతో అందరినీ అలరిస్తూ, నేటి సాంకేతికయుగంలో తెలుగు పాత్రని నొక్కి చెప్పే విధంగా కార్యశాలలు కూడా నిర్వహిస్తోంది.
ఆశయం
[మార్చు]ప్రస్తుతకాలంలో తెలుగుకు ప్రోత్సాహం తక్కువయినాయిటువంటి సాహితీ కూటమి అవసరాన్ని గుర్తించాలని, మరిన్ని కళాశాలలు కూడా తమ విద్యార్థులను తగు విధంగా ప్రోత్సహించాలని "విజ్ఞానజ్యోతి సాహితీవనం" ఆకాంక్షిస్తోంది.
కార్యక్రమాలు
[మార్చు]కళాశాలలోని ఈ విద్యార్థిసమితి ఇప్పటి దాకా సాంకేతిక విషయాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించింది.
విజ్ఞానజ్యోతి సాహితీవనం విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 2022 సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2022 సెప్టెంబర్ 9వ తేదీ వరకు 'అక్షర' పేరుతో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఈ కూటమి ఆధ్వర్యంలో 9 రోజుల కార్యక్రమం నిర్వహించారు.[1]
లక్ష్యం
[మార్చు]భాషాభిమానులకు సాహితీ ప్రపంచం అయిన విజ్ఞానజ్యోతి సాహితీవనం, నేటి సమాజానికి మాతృభాష ప్రాధాన్యతను, అందులోని మాధుర్యాన్ని తెలుపడంతో పాటు ఆధునికయుగంలో తెలుగు స్థానాన్ని సుస్థిరం చేసే దిశగా విజ్ఞానజ్యోతి సాహితీవనం కృషి చేస్తోంది.
మూలాలు
[మార్చు]- ↑ సాహితీ వనం, విజ్ఞానజ్యోతి (2022-09-09). "విజ్ఞానజ్యోతి సాహితీ వనం". నమస్తే తెలంగాణ దినపత్రిక. Retrieved 2022-09-15.