విద్యావతి
విద్యావతి | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | వృక్షశాస్త్రం విషయనిపుణులు, కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి |
విద్యావతి వృక్షశాస్త్రం విషయనిపుణులు, మొదటి మహిళా ఉపకులపతి. 1998, మే 6 నుండి 2001, మే 05 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంకు ఉపకులపతి పనిచేసింది. వృక్షశాస్త్ర రంగంలో 40 ఏళ్ల బోధనా, పరిశోధనా అనుభవముంది. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1][2]
జననం - విద్యాభ్యాసం
[మార్చు]విద్యావతి 1939, సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం పూర్తిగా హైదరాబాద్ లోనే పూర్తి అయింది. బేగంబజార్ లోని బన్సీలాల్ బాలికా విద్యాలయంలో హిందీ మాధ్యమంలో మరాఠీ రెండవ భాషగా చదువుకున్నది. 1955లో హెచ్.ఎస్.సి. ఉత్తీర్ణరాలైంది. 1957లో కోటి మహిళా కళాశాల నుండి ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్మీడియట్ చేసి, 1959లో బి.ఎస్సీ (వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం) లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణరాలైంది. 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్రంలో పీజీ పట్టా అందుకుంది.
అధ్యాపక జీవితం
[మార్చు]1966లో ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ కేంద్రంలో తాత్కాలిక అధ్యాపకురాలుగా తన అధ్యాపక జీవితాన్ని ప్రారంభించింది. 1968లో క్రమబద్ధమైన (రెగ్యులర్) అధ్యాపకురాలుగా నియమితులయ్యారు.
కాకతీయ విశ్వవిద్యాలయ వృక్షశాస్త్ర విభాగంగానికి శాఖాధిపతిగా, పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షురాలుగా విధులు నిర్వహించింది. పాలకమండలి సభ్యురాలుగా సేవలు అందించింది. 1998 మే నెలలో కాకతీయ విశ్వవిద్యాలయ ఉపకులపతిగా నియామకమై 2001 వరకు పనిచేసింది. ఈమె పర్యవేక్షణలో 25 మంది డాక్టరేట్లను, మరో ఇద్దరు ఎంఫిల్ పట్టాలను అందుకున్నారు.
కెనడా, అమెరికా, యూకే దేశాల్లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించడంతోపాటూ, పలు సమావేశాల్లో పాల్గొన్నది.
బహుమతులు - పురస్కారాలు
[మార్చు]- తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2017 మార్చి 8 [1][3][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 డైలీహంట్. "ఓరుగల్లు వనితల ఘనత". m.dailyhunt.in. Retrieved 28 March 2017.[permanent dead link]
- ↑ నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 6 April 2017.
- ↑ "Felicitation by the Government of Telangana ( 8th March, 2017)". Retrieved 17 March 2017.
- ↑ "Felicitation by the Government of Telangana ( 8th March, 2017)". Archived from the original on 17 March 2017. Retrieved 17 March 2017.