Jump to content

విద్యా వెంకటేష్

వికీపీడియా నుండి
విద్యా వెంకటేష్
జననం
సేలం, తమిళనాడు, భారతదేశం[1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2002–2006

విద్యా వెంకటేష్ ఒక భారతీయ నటి, ఆమె తమిళం, కన్నడ భాషా చిత్రాలలో నటిస్తుంది. తమిళ చిత్రం పంచతంతిరం (2002)లో కమల్ హాసన్‌తో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తర్వాత, ఆమె కన్నడ చిత్రాలైన చిగురిదా కనసు (2003), నేనపిరళి (2005) వంటి చిత్రాలలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నేనపిరాలిలో ఆమె నటనకు 53వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌లో ఉత్తమ నటి అవార్డు లభించింది.[2]

ఆమె నటించిన తమిళ సినిమా పంచతంతిరం తెలుగులో పంచతంత్రం (2002)గా అనువాదం చేయబడింది.

కెరీర్

[మార్చు]

షెరటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ (Sheraton Hotels and Resorts) ఫ్రాంచైజీలో భాగంగా విద్యా వెంకటేష్ పని చేసింది. చెన్నైలోని ఎతిరాజ్ కళాశాలలో బిఎ సాహిత్యంలో ఆమె డిగ్రీ చేసింది. ఆ తర్వాత ఆమె సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తూ రెండున్నర సంవత్సరాలు గడిపింది, ప్రధానంగా సింగపూర్, రష్యా మధ్య విమానాలలో ఎక్కువగా కనిపించేది.[3] ఆమె చిత్రాలలో నటించాలని ఆసక్తితో పంచతంతిరం (2002) దర్శకుడు కె. ఎస్. రవికుమార్‌ను ఒక పాత్ర కోసం సంప్రదించింది. ఆ చిత్రంలో శ్రీమాన్ భార్య పాత్ర పోషించింది. ఆ తర్వాత ఆమె తక్కువ-బడ్జెట్ చిత్రం కలాట్‌పడై (2003)లో పలువురు కొత్తవారితో కలిసి నటించింది. ఆమె పాత్రకు సానుకూలమైన సమీక్షలను అందుకుంది.[4][5]

ఆమె కన్నడ చిత్రం చిగురిడ కనసు (2003)లో చేసింది. ఆమె నేనపిరాలి (2005)లో తన నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఉత్తమ కన్నడ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.[6]

మూలాలు

[మార్చు]
  1. Srinivasa, Srikanth (28 September 2003). "On a different plane". Deccan Herald. Archived from the original on 25 December 2004. Retrieved 23 September 2020.
  2. "South indian film industry glitters at Filmfare Awards". India New England. 19 October 2006. Archived from the original on 8 February 2013. Retrieved 5 December 2023.
  3. "An interview with 'Chiguridha Kanasu' heroine - Vidhya Venkatesh". www.viggy.com. Retrieved 10 November 2023.
  4. Archived copy Archived 7 మార్చి 2016 at the Wayback Machine
  5. "Kaalaatpadai". chennaionline.com. Archived from the original on 22 December 2002. Retrieved 12 January 2022.
  6. "sify.com". Retrieved 10 November 2023.