Jump to content

విమాన సహాయకులు

వికీపీడియా నుండి
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్ ప్రయాణికుడిని కూర్చోబెడుతున్న దృశ్యం

విమాన సహాయకులు (ఆంగ్లం: Flight attendant/Air host/Steward) వాణిజ్య విమానాల్లో, కొన్ని ప్రభుత్వ విమానాల్లో పనిచేసే సిబ్బందిలో ఒక బృందం.[1] ఈ సిబ్బందిని అంతా కలిపి క్యాబిన్ క్రూ అని వ్యవహరిస్తారు. వీరు కాకుండా కాక్‌పిట్ లో ఉండే పైలట్ (విమాన చోదకులు), ఫ్లైట్ ఇంజనీర్లు విమానం నడిపే బృందంలో ముఖ్యమైన వారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు వీరి ప్రధాన బాధ్యతలు.

ఒక విమానంలో ఎంతమంది సహాయకులు ఉండాలనేది దేశపు విమానయాన చట్టాలను అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు అమెరికాలో వాణిజ్య విమానాల్లో ప్రతి 50 మంది ప్రయాణికులకు ఒక సహాయకులు ఉండాలి.[2] ప్రస్తుతం చాలా విమానాల్లో ఎక్కువ భాగం మహిళలే సహాయకులుగా ఉన్నారు. 1980 నుంచి మగవారు కూడా ఈ వృత్తిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రవేశిస్తున్నారు.[3]

చరిత్ర

[మార్చు]

విమాన సహాయకుల బాధ్యతలు ప్రజా రవాణా నౌకలు, రైళ్ళలో పనిచేసే సహాయకుల బాధ్యతల్లాంటివే. కాకపోతే విమానాల్లో కొన్ని సరిహద్దులతో కూడిన ప్రదేశాలు ఉంటాయి కాబట్టి ప్రయాణికులకు దగ్గరగా ఉండి సేవలు అందించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే విమానాలలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఉంటుంది.

బాధ్యతలు

[మార్చు]

సాధారణ సేవలను అందించడం, విమాన ప్రయాణీకులకు సరైన భద్రత, సౌకర్యాలు అందేలా చూడటం, అత్యవసర పరిస్థితులకు స్పందించడం వీరి ప్రధాన బాధ్యతలు.[4]

విమానం గాల్లోకి ఎగిరే ప్రతి సారి విమాన సహాయకులు, పైలట్‌లు భద్రత, అత్యవసర చెక్‌లిస్ట్‌లు, అత్యవసర పరికరాల స్థానాలు, ఆ విమాన రకానికి సంబంధించిన ఇతర లక్షణాలపై దృష్టి పెడతారు. ప్రత్యేక అవసరాలు గల ప్రయాణికులు, ఒంటరిగా ప్రయాణించే చిన్న పిల్లలు లేదా VIPల వంటి బోర్డింగ్ వివరాలు ధృవీకరించబడతాయి. వాతావరణ పరిస్థితులు, అందువల్ల విమానంలో కలగబోయే కుదుపులు లాంటి వాటి గురించి ముందుగానే చెబుతారు. విమానంలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు అందులో ఉన్న పరికరాలను ఎలా వాడుకోవాలో చూపిస్తారు. అత్యవసర ద్వారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో సూచిస్తారు. విమానం బయలుదేరే ముందు అందరికీ సీటు బెల్టు ధరించేలా, సీటు నిటారుగా ఉండేలా, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఆఫ్ చేయడం గానీ, ఫ్లైటు మోడ్ లో ఉండేలా చూస్తారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Cabin Managers – Corporate". cabinmanagers.com. Archived from the original on 2008-07-04. Retrieved 2023-11-21.
  2. "eCFR — Code of Federal Regulations: Title 14, §121.391 Flight attendants".
  3. Saenz, Rogelio and Evans, Louwanda (June 2009) "The Changing Demography of U.S. Flight Attendants Archived 2018-03-08 at the Wayback Machine". Population Reference Bureau. Retrieved 16 July 2015.
  4. 4.0 4.1 "Flight Attendants: Occupational Outlook Handbook". U.S. Bureau of Labor Statistics. Retrieved 27 March 2019.