వినోద్ బాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వినోద్ బాల
జననం
వినోద్ బాల

ఆగష్టు 19
విద్యఏరోనాటిక్స్ కోర్సు
వృత్తిరంగస్థల, బుల్లితెర, చలనచిత్ర నటుడు, నిర్మాత
తల్లిదండ్రులుఎం.ఏ. చౌదరి, జయమ్మ

వినోద్ బాల ప్రముఖ రంగస్థల, బుల్లితెర, చలనచిత్ర నటుడు, రంగస్థల అధ్యాపకుడు, నిర్మాత.

జననం[మార్చు]

వినోద్ బాల భీమవరం లో జన్మించారు.

కళారంగ ప్రస్థానం[మార్చు]

ఏరోనాటిక్స్ కోర్సుని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ లోని మధు ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకొని, బంగారు పతకం సాధించారు. పీపుల్స్ ఎన్‌కౌంటర్ సినిమాలో భానుప్రియ సోదరుడి పాత్రలో నటించి తెరంగేట్రం చేసిన వినోద్ బాల, టి.వి.ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా కూడా చేసారు. మంజులానాయుడు దర్శకత్వంలో యద్ధనపూడి సులోచనారాణి నవల "ఆగమనం"ను రుతురాగాలు పేరిట టీవీ సీరియల్‌గా తీసినప్పుడు, అందులో వినోద్‌బాల కూడా ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఆ సీరియల్ హిట్ కావడం వల్ల మరిన్ని అవకాశాలు పొందిన నటుల్లో వినోద్‌బాల కూడా ఒకరు. కసూర్తి టీవీ సీరియల్‌లో నటనకు గాను ఉత్తమ సహాయనటుడిగా పురస్కారాన్ని కూడా పొందారు వినోద్ బాల. ఈయన ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్‌తో కలిసి కామెడీ ఫిలిం అవార్డ్స్ అనే కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేశారు. రామ్‌గోపాల్‌వర్మ "శివ" సినిమాకి దర్శకత్వం వహిస్తున్నప్పుడు తొలుత వినోద్‌బాల పైనే హీరో ట్రైల్ షూట్ తీశారని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

నటించిన చిత్రాలు[మార్చు]

  1. పీపుల్స్ ఎన్‌కౌంటర్
  2. లాఠి
  3. వారసుడు
  4. కన్యాదానం
  5. తొలిపొద్దు
  6. గండిపేట రహస్యం
  7. శివమణి
  8. ఆంధ్రావాలా (సినిమా)
  9. మనోహరం

బయటి లింకులు[మార్చు]