Jump to content

విప్రచిత్తి

వికీపీడియా నుండి

విప్రచిత్తి ఒక భారతీయ పురాణ నాయకుడు.[1] సూర్య పూరణం ప్రకారం ఇతని సోదరుడు పులోముడును ఇంద్రుడు చంపిన తరువాత అతను దానవులకు రాజు అయ్యాడు. కశ్యపునికి, దనువులో పుట్టిన 100 మంది కుమారుల లోని ఒక పుత్రుడు. ఇతను వందమంది కుమారులలో అత్యంత శక్తివంతమైనవాడు.[2] ఈ కథ పద్మ పురాణంలో ప్రస్తావించబడింది.

వివాహం

[మార్చు]

హిరణ్యకశిపుణఙ సోదరి, దితి కుమార్తె అయిన సింహిక (హోళిక) ను వివాహం చేసుకున్నాడు.

సంతానం

[మార్చు]

ఇతనికి రాహువు, కేతువు, నముచి, వాతాపి, ఇల్వలుడు, నరకుడు, స్వర్భానుడు, పులోముడు, వక్త్రయోధి మొదలగువారు కొడుకులు.

యుద్ధం

[మార్చు]

ఇతని కుమారులలో ఒకడు రాహువు. రాహువు యొక్క మార్గదర్శకంలో ఇతని సైన్యం దేవతలను ఓడించింది.

పర్యవసానాలు

[మార్చు]

విప్రచిత్తి తదుపరి మహాభారతంలో జరాసంధగా అవతరించాడు.

మూలాలు

[మార్చు]
  1. A Classical Dictionary of India, p. 173
  2. http://gloriousindia.com/scriptures/puranas/padma_purana/the_origin_of_deities_demons_and_serpents.html Glorious India-Padma Purana-The origins of Deities Demons and Serpents