విమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విమి
జననం1943[1]
మరణం1977 ఆగస్టు 22(1977-08-22) (వయసు 33–34)
క్రియాశీల సంవత్సరాలు1967–1974
సుపరిచితుడు/
సుపరిచితురాలు
నటి

విమి (1943 – 1977 ఆగస్టు 22) పంజాబ్ రాష్ట్రానికి చెందిన సినిమా నటి. అబ్రూ, హమ్రాజ్,[2] పతంగా వంటి హిందీ సినిమాలలో నటించింది. సునీల్ దత్‌ నటించిన హమ్రాజ్‌ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది.

జననం

[మార్చు]

విమి 1943లో పంజాబ్ లోని జలంధర్ నగరంలో జన్మించింది.[1]

సినిమారంగం

[మార్చు]

1967లో బిఆర్ చోప్రా దర్శకత్వం వహించిన హమ్‌రాజ్‌ సినిమాలో సునీల్ దత్ పక్కన నటించి సినిమారంగంలోకి అడుగుపెట్టింది. శశి కపూర్‌తో 1971లో పతంగ, 1974లో వచన్ మొదలైన సినిమాలలో నటించింది. 1968లో వచ్చిన ఆబ్రూ సినిమాలో దీపక్ కుమార్ సరసన ప్రధాన పాత్రలో నటించింది. 1973లో వచ్చిన నానక్ నామ్ జహాజ్ హై అనే పంజాబీ సినిమాతో కూడా నటించింది. విమి నటించిన చివరి సినిమా క్రోధి, ఆమె మరణించిన నాలుగు సంవత్సరాల తరువాత 1977లో విడుదలైంది.[3]

పాటలు

[మార్చు]

ఆమెపై చిత్రీకరించిన పాటలు:

  • "తుమ్ అగర్ సాథ్ దేనే కా వాడా కరో" - హమ్రాజ్ (1967)
  • "నా ముహ్ చూపాకే జియో" - హమ్రాజ్ (1967)
  • "నీలే గగన్ కే టేల్" - హమ్రాజ్ (1967)
  • "కిసీ పథర్ కి మూరత్ సే" - హమ్రాజ్ (1967)
  • "ఆప్ సే ప్యార్ హువా" - ఆబ్రూ (1968)
  • "జిన్హే హమ్ భుల్నా చాహే" - ఆబ్రూ (1968)
  • "తోడా రుక్ జాయేగీ తో తేరా క్యా జాయేగా" - పతంగా (1971)

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమాలు పాత్ర ఇతర వివరాలు
1967 హమ్రాజ్ మీనా వర్మ తొలిచిత్రం
1968 అబ్రూ నీనా
1969 నానక్ నామ్ జహాజ్ హై చన్నీ జాతీయ అవార్డు గెలుచుకున్న పంజాబీ సినిమా
1971 పతంగా రేణు
1971 గుడ్డి అతిధి పాత్ర
1971 కహిన్ ఆర్ కహిన్ పార్ నర్తకి యువరాణి
1973 కహానీ హమ్ సబ్ కీ
1974 వచన్
1978 ప్రేమి గంగారాం
1981 క్రోధి

మరణం

[మార్చు]

విమి 1977, ఆగష్టు 22న నానావతి ఆసుపత్రిలోని సాధారణ వార్డులో కాలేయ వ్యాధికి చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మృతదేహాన్ని తేల చేతి బండిలో శ్మశాన వాటికకు తరలించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "The untold, tragic tale of 'Humraaz' actress Vimi". News18. Retrieved 2022-05-06.
  2. "The untold, tragic tale of 'Humraaz' actress Vimi". News18. Retrieved 2022-05-06.
  3. "Pakeezah actress Geeta Kapoor's case, while heartbreaking, is not an isolated one". Firstpost. Retrieved 2022-05-06.
  4. The Times of India directory and year book including who's who. Bennett, Coleman & Co. 1979. p. 241.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=విమీ&oldid=3552044" నుండి వెలికితీశారు