విరుద్ధాహారం
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మనం ఆహారం తీసుకునేటపుడు రకరకాల పద్ధతులు అవలంబించమంటుంది ఆయుర్వేదం. ఈ పద్ధతులలో విరుద్ధాహారం తినరాదు.అనగా ఆయుర్వేదం ప్రకారం విరుద్ధములైన ఆహార పదార్థాలను కలిపి తినరాదు. మనం తినే ఆహారం ఒక్కటే ఐనా మనం ఆహారం పేరుతో రకరకాల పదార్థాలను లోపలికి తీసుకుంటున్నాం. అలాంటి పదార్థాలలోనూ లోపల కొంత శక్తి ఉంటుంది. అవి జీర్ణం అయ్యే సమయాల్లో మార్పువస్తుంది. అవి జీర్ణం అయిన తర్వాత శరీరంలో శోషణం అయ్యే విధానంలోనూ, అవి నిలువ ఉండే పదార్థాలలోనూ అవి మన శరీరంపై చూపించే ప్రభావంలోనూ మార్పులు ఉంటాయి. కాబట్టి కొన్ని రకార ఆహారపదార్థాలను కలిపి తినకూడదు.
కారణాలు
[మార్చు]విరుద్ధాహారం ఆయుర్వేదం ప్రకారం తీసుకోరాదు. ఉదాహరణకు వివిధ మాంసాల్నిగానీ, చేపలను గానీ, పాలుగానీ కలిపి తినకూడదు. అందులోనూ ముఖ్యంగా పాలు, చేపలు అస్సలు కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే చేపలు వేడి కలిగించే గుణాన్ని (ఉష్ణవీర్యం) కలిగి ఉంటాయి. పాలు చల్లదనాన్ని కల్గించే గుణాన్ని (శీతవీర్యం) కలిగి ఉంటాయి. ఇవి రెండూ కలిపి తింటే శరీరంలో "ఆమం" అనేది ఏర్పడుతుంది. ఈ "ఆమము" అన్ని వ్యాధులకీ మూలం. అలాగే పాలు, మొలకెత్తిన విత్తనాలను కలిపి తినకూడదు. అలాగే పాలని పుల్లని పదార్థాలతో తీసుకోకూడదు. కలిపే కాకుండా, పాలు త్రాగిన తర్వాత కూడా పుల్లని పదార్థాలు కలిపి తీసుకోకూడదు. అలాగే పుల్లని పదార్థాలను తిన్న తర్వాత కూడా పాలు తాగకూడదు. మినుములు, ఉలవలతో చేసిన పదార్థాలను కలిపి పాలు తీసుకోరాదు. ముల్లంగి కలిపి పాలు తీసుకోకూడదు.
పలసయకచరద
[మార్చు]- చేపమాంసాన్ని ఆవనూనెతో కలిపి తినకూడదు.
- పావురం మాంసాన్ని కూడా ఆవనూనెతో కలిపి తినకూడదు.
- కోడిమాంసాన్ని, దుప్పి మాంసాన్ని పెరుగుతో కలిపి తినకూడదు.
- కుసుమనూనెతో మేకమాంసాన్ని తినకూడదు.
- పాలలో ఉప్పు కలిపి త్రాగకూడదు.
- ద్రాక్ష సారాతో బచ్చలి కూర తినకూడదు.
- ముల్లంగితో మినప్పప్పు కలపకూడదు.
- పెరుగు, మజ్జిగ కలిపి అరటిపండు తినకూడదు.
- పెరుగు, బెల్లం, తేనె, నెయ్యితో నిమ్మరసం కలపకూడదు.
- మద్యం, పెరుగు, తేనె వీటిలో వేడి పదార్థములు కలిపి తినకూడదు.
- పాయసము, మద్యము కలిపి తీసుకోకూడదు.
- తేనె, నెయ్యి సమభాగాల్నికలిపి తీసుకోరాదు.
- తేనె, తామర గింజలు కలిపి తీసుకోరాదు.
- పంచదార పానకము, మద్యము, తేనెతో కలిపి తీసుకోకూడదు.
- ఆవనూనెలో వేయించిన మష్రూమ్స్ తినకూడదు.
- తెలగపిండితో కలిపి బచ్చలి తినకూడదు.
- నీటి కొంగ మాంసాన్ని, మద్యాన్ని కలిపి తీసుకోకూడదు.
- ఉడుము మాంసం, నెమలి మాంసం ఆముదం కలిపి వండకూడదు.
- శరీరం వేడిగా ఉన్నప్పుదు ఒకేసారి చల్లని నీటిలో దిగకూడదు.
- ఒళ్ళు బాగా వేడిగా ఉన్నప్పుడు వేడిపాలు త్రాగరాదు. అలాగే చేస్తే చర్మవ్యాధులు వచ్చే ఆవకాశం ఉంది. రక్త సంబంధమైన వ్యాధులు కూడా వచ్చె అవకాశం ఉంది.
- ఆయాసం కల్గించే పనిని చేసిన వెంటనే భోజనం చేయకూడదు.
- పాత ధాన్యం, కొత్త ధాన్య్ం కలిపి వండకూడదు.
- పచ్చివి, పండినవిగా ఉన్న పండ్లు కలిపి తినరాదు.
- పాలు, ఉలవలు కలిపి తినకూడదు. ఎందుకంటే పాలు శీతల గుణాన్ని కలిగించేవి. ఉలవలు ఉష్ణగుణాన్ని కల్గించేవి. ఇది అసదృశ గుణ విరుద్ధం అంటారు.
- పాలు, పనసపండు కలిపి తినరాదు. దీంట్లో పాలు, పనస పండు రెండూ శీతల గుణాన్నే కల్గి ఉన్నా అవి స్వభావంగానే సదృశగుణ విరుద్ధాలు అని చెబుతుంది ఆయుర్వేదం.
- పాలు చేపలు కలిపి తినకూడదు. ఇది సదృశ అసదృశ గుణ విరుద్ధాలకు ఉదాహరణ.
- వేడిచేసిన పెరుగు తినకూడదు. ఇది సంస్కార విరుద్ధం. అనగా పెరుగును వేదిచేత సంస్కరించాం కాబట్టి ఇది విరుద్ధం.
- సమానమైన పరిమాణంలో తేనె, నెయ్యి తీసుకోకూడదు. ఇది మాత్రా విరుద్ధం.
- చవిటి నేలలో ఉన్న నీరు వ్రాగరాదు. ఇది మాత్రా విరుద్ధం.
- రాత్రి పూట పేలాలు, పాప్‌కార్న్ లాంటివి కేవలం పిండిలా పొడిగా ఉండే పదార్థాలను తినకూడదు. అది కాల విరుద్ధం.
- పిండితో చేసిన ఉండలను తింటూ మధ్యలో నీరు త్రాగకూడదు. ఇది సంయోగ విరుద్ధం
సందేహాలు
[మార్చు]విరుద్ధం పదార్థాలను తింటే ప్రానహాని జరుగక పోవచ్చు కానీ కొన్నాళ్ళ తర్వాత ఇబ్బంది కలుగువచ్చు. కొందరిలో యిలా విరుద్ధాహార పదార్థాలు తిన్నా ప్రమాదం లేని సందర్భాలుంటాయి. దీనికి కారణం ఆయుర్వేదం ప్రకారం ఉంది. రెగ్యులర్ గా వ్యాయామం చేసేవాళ్ళు, ఆయిలీస్కిన్ వాళ్ళూ, ఎప్పుడూ మంచి ఆకలి ఉన్నవాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, బాగా బలవంతులు, కొద్దిగానే విరుద్ధాహారం తీసుకున్నవాళ్ళకి ఏ ఇబ్బంది కలుగదు. అంతే కాకుండా విరుద్ధమైన దైనప్పటికీ అదే ఆహారాన్ని ఎప్పుడూ తింటుంటె వాళ్ళకి అది ఏమీ రోగాలని కలుగ చెయ్యదు. దీనినే "సాత్యము" అంటారు. 'తినగ తినగ ' లాగా విరుద్ధమైనప్పటికీ శరీరం దాన్ని జయిఖ్ంచే "సెల్ఫ్ డిఫెన్స్" ఏర్పరచుకుంటుంది అని దీనర్థం.