విల్లియం హోవెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దత్తమండలాలుగా పిలువబడిన రాయలసీమలో క్రైస్తవ పరిచర్య ప్రారంభముగూర్చి తెలుసుకోవాలంటే విల్లియం హోవెల్ గూర్చి తెలుసుకోవాలి. ఈయన కడప జిల్లాలోని పబ్లిక్ వర్క్స్ శాఖలో సర్వేయర్ గా నియమితులయ్యారు.

పరిచర్య[మార్చు]

ఈయన కడప జిల్లాలో వున్నప్పుడు ఖాలీ సమయంలో ప్రజలకు సువార్త చెప్పేవాడు. ఈ సమయంలోనే ఆయన చిన్నసమూహాన్ని సమకూర్చాడు. అదేసమయంలో లండన్ మిషనరీ సొసైటీవారు తెలుగువారి మద్యలో తమ పరిచర్యను ప్రారంభించాలనుకుంటున్నారు.1822లో వారు ఈ చిన్న సమూహంమీద కడప పట్టణంలో హోవెల్ ను మిషనరీగా నియమించారు.[1]

జాన్ వాండ్స్[మార్చు]

బళ్ళారిలో 1810లో పరిచర్యను ప్రారంభించిన జాన్ వాండ్స్ ఆ తర్వాత కడపకు వచ్చి 1822లో లండన్ మిషన్ ను ప్రారంభించారు. ఈ జిల్లాలోనే మొదటిసారిగా మాలల మధ్యన మత మార్పిడి ఉద్యమం ప్రారంభంమైనది. హోవెల్ గారు పులివెందుల ప్రాంతంలో పరిచర్యను విస్తరించుటకు చాలా ప్రయాసపడ్డారు. ఈయన పరిచర్య మూలంగా వీరప్ప అనే బ్రాహ్మణుడు క్రైస్తవుడయ్యాడు.చాలా గ్రామాలలో ఈయన పాఠశాలలను ప్రారంభించారు. 1830 లో కరువు సంభవించినప్పుడు ప్రజలకు చాలా సహాయము చేశారు. ఈయన తరచుగా పోతులూరి వీరబ్రహ్మం గారు సమాధి చేయబడిన ప్రస్తుతం కందిమల్లాయపల్లె గా పిలువబడుతున్నా ప్రాంతాన్ని దర్శించేవారు.

మూలాలు[మార్చు]

  1. Hibbertware. Christian Missions in Telugu Country. Westminister.

ఇతర లింకులు[మార్చు]