విల్లిస్ టవర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విల్లిస్ టవర్ (మునుపటి పేరు సియర్స్ టవర్) ఉత్తర అమెరికాలోని ఆకాశ హర్మ్యాలలో ఎత్తైన, ప్రంపంచంలో అయిదవ స్థానాన్ని పొందిన చికాగోలోని ఆకాశ హర్మ్యం. దీనిలో 110 అంతస్థులు ఉన్నాయి. ఎత్తు 1,450 అడుగులు (టవర్ పని జంట ఆంటెన్నాలను కలుపుకుంటే ఎత్తు 1730 అడుగులు).

ఆకాశం నిర్మలంగా ఉన్న రోజున పైనున్న స్కైడెక్ నుంచి నాలుగు రాష్ట్రాలు - ఇల్లినాయిస్, ఇండియానా, మిషిగన్, మరియూ విస్కాంసిన్ రాష్ట్రాలు కనిపిస్తాయి.

నిర్మాణానికి మూడు సంవత్సరాలు పట్టిన ఈ కట్టడం 1973 లో పూర్తయింది. అతి గాలికి ప్రసిద్ధి చెందిన షికాగో నగరంలో చాలా గాలి వీస్తున్నప్పుడు ఈ టవర్ ఊగుతూ దాని నిజకేంద్రం నుంచి ఆరు ఇంచులు పక్కగా కూడా వెళుతుంది.