Jump to content

వివ్ స్టీఫెన్స్

వికీపీడియా నుండి
వివ్ స్టీఫెన్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వివియన్ షెరిల్ స్టీఫెన్స్
పుట్టిన తేదీ(1953-11-08)1953 నవంబరు 8
ఫాక్స్టన్,, న్యూజీలాండ్
మరణించిన తేదీ2021 సెప్టెంబరు 5(2021-09-05) (వయసు 67)
నేపియర్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాటర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 23)1978 1 January - Australia తో
చివరి వన్‌డే1978 8 January - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1974/75–1978/79Wellington
1979/80–1981/82Central Districts
కెరీర్ గణాంకాలు
పోటీ WODI WFC WLA
మ్యాచ్‌లు 2 22 15
చేసిన పరుగులు 12 705 250
బ్యాటింగు సగటు 6.00 24.31 25.00
100s/50s 0/0 1/1 0/1
అత్యధిక స్కోరు 9 135 70
వేసిన బంతులు 618 306
వికెట్లు 16 9
బౌలింగు సగటు 23.43 19.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/48 3/32
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 14/– 8/–
మూలం: CricketArchive, 2021 6 November

వివియన్ షెరిల్ స్టీఫెన్స్ (1953, నవంబరు 8 - 2021, సెప్టెంబరు 5) న్యూజీలాండ్ క్రికెటర్. ప్రధానంగా కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది. 1978 ప్రపంచ కప్‌లో న్యూజీలాండ్ తరపున రెండు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. వెల్లింగ్టన్, సెంట్రల్ డిస్ట్రిక్ట్ తరపున దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.

జననం

[మార్చు]

వివియన్ షెరిల్ స్టీఫెన్స్ 1953, నవంబరు 8న న్యూజీలాండ్ లోని ఫాక్స్టన్ లో జన్మించింది.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

టీచింగ్ చదువుతున్నప్పుడు, తన ప్రాంతంలో వ్యవస్థీకృత మహిళా క్రికెట్ లేకనోవడంతో పురుషుల జట్టు కోసం క్రికెట్ ఆడింది. తర్వాత వెల్లింగ్టన్‌లో క్లబ్ క్రికెట్ ఆడటం ప్రారంభించింది, చివరికి వెల్లింగ్టన్ ప్రతినిధి జట్టు కోసం ఆడింది.[2] 1976లో స్టీఫెన్స్ న్యూజీలాండ్‌తో కలిసి భారత్‌లో పర్యటించింది, భారత జాతీయ జట్టుతో రెండు మూడు రోజుల ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడింది. మూడు ఇన్నింగ్స్‌లలో 17 పరుగులు చేసింది.[3] 1978లో, స్టీఫెన్స్ భారతదేశంలో జరిగే ప్రపంచ కప్ కోసం న్యూజీలాండ్ జట్టులో ఎంపికయింది. టోర్నమెంట్‌లోని మొదటి మ్యాచ్ తో తన వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసింది. ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆరో స్థానంలో వచ్చిన తొమ్మిది పరుగులు చేసింది.[4] టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్‌తో ఏకైక మ్యాచ్ ఆడింది. ఇక్కడ కేవలం మూడు పరుగులు చేసి జాక్వెలిన్ కోర్ట్ చేత అవుట్ చేయబడింది.[5]

తన భర్త పనిచేసిన నేపియర్‌కు వెళ్ళిన తర్వాత, స్టీఫెన్స్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ మహిళా బృందాన్ని స్థాపించడంలో సహాయం చేసింది. ఈ జట్టు 1978-79 సీజన్‌లో ఆడటం ప్రారంభించింది. తరువాతి సీజన్‌లో జాతీయ పోటీలో పాల్గొనేందుకు అనుమతించబడింది.

ఆడ నుండి రిటైర్మెంట్ తరువాత, స్టీఫెన్స్ క్రికెట్‌లో నిర్వాహకుడిగా కొనసాగింది. 2000లో హాక్స్ బే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ బోర్డు మెంబర్‌గా మారింది. 2014 డిసెంబరు వరకు బోర్డులో కొనసాగింది, అసోసియేషన్ నిర్వహణ కమిటీ సభ్యురాలుగా కూడా పనిచేసింది.[2] న్యూజీలాండ్ ఆతిథ్యమిచ్చిన 2000 మహిళల ప్రపంచ కప్‌లో స్టీఫెన్స్ టోర్నమెంట్ అధికారిగా కూడా పనిచేసింది.[6] 2015 నవంబరులో, సిడిసిఏలో జీవితకాల సభ్యురాలిగా ఉంది.[7]

మరణం

[మార్చు]

స్టీఫెన్స్ 2021 సెప్టెంబరు 5న నేపియర్‌లో మరణించింది.[8]

మూలాలు

[మార్చు]
  1. Viv Sexton, CricketArchive. Retrieved 1 September 2016.
  2. 2.0 2.1 "Cricket: Hopes How will play in other formats", Hawke's Bay Today, 2 December 2014. Retrieved 1 September 2016.
  3. Women's two innings matches played by Viv Sexton, CricketArchive. Retrieved 1 September 2016.
  4. Women's World Cup, 1st Match: Australia Women v New Zealand Women at Jamshedpur, Jan 1, 1978, ESPNcricinfo. Retrieved 1 September 2016.
  5. Women's World Cup, 5th Match: England Women v New Zealand Women at Hyderabad (Deccan), Jan 8, 1978, ESPNcricinfo. Retrieved 1 September 2016.
  6. "Women's World Cup: England victory close to farce", The Telegraph, 7 December 2000. Retrieved 1 September 2016.
  7. "Cricket: member for life over the moon", Hawke's Bay Today, 14 November 2015. Retrieved 1 September 2016.
  8. "CD women's cricket great Viv Stephens dies". Stuff.co.nz. 14 September 2021. Retrieved 3 November 2021.

బాహ్య లింకులు

[మార్చు]