విశాఖపట్నం రిఫైనరీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖపట్నంలోని యారాడ కొండ నుండి HPCL (ఎగువ-ఎడమ) దృశ్యం

విశాఖపట్నం రిఫైనరీ (అధికారికంగా: విశాఖ రిఫైనరీ ), భారతదేశంలో HPCLకు ఉన్న రెండు చమురు శుద్ధి కర్మాగారాలలో ఒకటి. రెండవది, ముంబై రిఫైనరీ. ఇది విశాఖపట్నం లోని ముందుగా ఏర్పాటైన ప్రధాన పరిశ్రమలలో ఒకటి. తూర్పు తీరంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారం. జాతీయీకరణ తర్వాత, HPCL ఒక మెగా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్‌గా రూపాంతరం చెందింది. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ కంపెనీ.

చరిత్ర[మార్చు]

విశాఖ రిఫైనరీ, 1957 లో సంవత్సరానికి 0.675 మిలియన్ టన్నుల సామర్థ్యంతో కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ (ఇండియా) పేరుతో మొదలైంది. 1976లో దీన్ని భారత ప్రభుత్వం జాతీయ చేసింది. 1978లో CORIL-HPCL అమాల్గమేషన్ ఆర్డర్, 1978 ద్వారా HPCL లో దీన్ని విలీనం చేసారు.

1985లో విశాఖ రిఫైనరీ ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్-I (VREP-I) గా పిలువబడే మొదటి అతిపెద్ద విస్తరణ ప్రాజెక్ట్ కింద రిఫైనరీ సామర్థ్యాన్ని సంవత్సరానికి 4.5 మిలియన్ము టన్నులకుకి పెంచారు. మళ్ళీ 1999లో రిఫైనింగ్ సామర్థ్యాన్ని 7.5 మిలియన్ టన్నులకు, 2010లో సంవత్సరానికి 8.3 మిలియన్ టన్నులకూ పెంచారు.

విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్టు (VRMP) [1][మార్చు]

విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్ట్ (VRMP) అనేది భారతదేశంలోని విశాఖపట్నంలో ఉన్న విశాఖ రిఫైనరీ యొక్క బ్రౌన్‌ఫీల్డ్ విస్తరణ. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అమలు చేస్తోంది. దీనితో విశాఖ రిఫైనరీ రిఫైనింగ్ సామర్థ్య< సంవత్సరానికి 8.3 మిలియన్ టన్నుల నుండి 15 మిలియన్ టన్నులకు విస్తరిస్తుంది.

ఈ విస్తరణలో భాగంగా 2020 లో భారత్ స్టేజ్-VI (BS-VI) ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇంధనాల ఉత్పత్తి, పంపిణీని ప్రారంభించింది. BS VI అనేది ఒక కొత్త ఉద్గార ప్రమాణం, ఇది భారతదేశపు మోటారు వాహనాల నిబంధనలను యూరోపియన్ యూనియన్ (EU) లైట్-డ్యూటీ ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, హెవీ డ్యూటీ ట్రక్కులు, బస్సులు, ద్విచక్ర వాహనాలకు సంబంధించిన నిబంధనలకు సమానంగా ఉంటుంది. ఈ ప్రమాణం భారతదేశంలో 2020 నుండి అమలులోకి వచ్చింది.

VRMP ప్రాజెక్టుకు సుమారు $ 3100 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుందని అంచనా వేసారు. ఈ ప్రాజెక్టు పరిధిలో సంవత్సరానికి 9 మిలియన్ టన్నుల క్రూడ్ డిస్టిలేషన్ యూనిట్ (CDU), ప్రస్తుతం ఉన్న మూడు CDUలలో ఒకదాని స్థానంలో సంవత్సరానికి 3.3 మిలియన్ టన్నుల వాక్యూమ్ గ్యాస్ ఆయిల్ హైడ్రోక్రాకర్, ఏడాదికి 2,90,000 టన్నుల నాఫ్తా ఐసోమెరైజేషన్ యూనిట్ (NIU) వంటి ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఉంది. 

అదనంగా సంవత్సరానికి 3.1 మిలియన్ టన్నుల సాల్వెంట్ డి-ఆస్ఫాల్టింగ్ (SDA) యూనిట్, సంవత్సరానికి 2.5 మిలియన్ టన్నుల స్లర్రీ హైడ్రోక్రాకర్ యూనిట్ (SHCU), రోజుకు 96 టన్నుల ప్రొపైలిన్ రికవరీ యూనిట్ (PRU) కూడా ఈ ప్లాన్‌లలో ఉన్నాయి

VRCFP (విశాఖ రిఫైనరీ క్లీన్ ఫ్యూయల్స్ ప్రాజెక్ట్)[మార్చు]

ఈ ప్రాజెక్టును విశాఖ రిఫైనరీలోని ప్రాజెక్ట్స్ డిపార్ట్‌మెంటు అమలు చేసింది. ఈ ప్రాజెక్టు రూ. 16352 అంచనా వ్యయంతో పర్యావరణ మెరుగుదలకు దోహదపడే ఇంధనాలను ఉత్పత్తి చేస్తుంది.

మూలాలు[మార్చు]

  1. "Visakh Refinery Modernisation Project, Visakhapatnam - Hydrocarbons Technology".