విశ్వం పుట్టుక కి కారణం
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: ఒక దృక్కోణంతో వ్యక్త్రిగత అభిప్రాయాలతో ఉంది, వాటికి మూలాల్లేవు. సముచితమైన సమాచారం ఏదైనా ఉంటే దాన్ని విశ్వం పేజీలో గానీ, బిగ్ బ్యాంగ్ పేజీలో గానీ విలీనం చేసి ఈ వ్యాసాన్ని తొలగించవచ్చు. ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/విశ్వం పుట్టుక కి కారణం పేజీలో రాయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
బిగ్ బ్యాంగ్ తీయరీ ప్రకారం, విశ్వం ఒక పెద్ద విస్ఫోటనంతో ప్రారంభమైంది. ఆ విస్ఫోటనం నుంచీ జరిగిన సంఘటనల ప్రవాహమే కాలం. అంటే విశ్వం తో పాటు కాలం కూడా పుట్టింది. కానీ, ఏ కారణం వలన బిగ్ బ్యాంగ్ పేలుడు జరిగింది? బిగ్ బ్యాంగ్ కి ముందు అంతటా “ఏమీ లేని స్థితి” ఉండేది. ఆ స్థితిలో పదార్థం లేదు, శక్తి లేదు, స్థలం లేదు. అనుభవించటానికి నువ్వూ నేనూ లేము. ఆ శూన్యం లో కాలం లేదు. కాలం ఉండటానికి ఏదో ఒక సంఘటన జరగాలి కదా! ఒక సంఘటన జరిగితే, ఆ సంఘటన నుంచీ సమయాన్ని లెక్కించవచ్చు. ఆ సంఘటన ముందు సమయాన్ని కొలవవచ్చు. ఏ సంఘటనలూ జరగటానికి వీలులేని సందర్భం లో సహజంగానే సమయాన్ని ఊహించలేము. అది పరిపూర్ణమైన శూన్యం. దానిలో సాపేక్షత లేదు. అలానే అటువంటి శూన్యాన్ని నిర్వచించలేము (అన్ డిఫైన్డ్). కాబట్టీ విశ్వం పుట్టుకకి ముందు కాలం లేదు. కారణమూ ప్రభావమూ (కాజ్ అండ్ అఫెక్ట్) అనేవి కాలం లో జరిగే విషయాలు. కారణం ముందు జరిగి, తద్వారా దాని ప్రభావం పుడుతుంది. కాలం లేని చోట కారణమూ ప్రభావమూ ఉండవు. విశ్వం పుట్టుకతోనే కాలం ఏర్పడింది. పుట్టుకకు ముందు కాలం లేదు. కాలం లేని చోట కారణం కూడా ఉండదు. కాబట్టీ, విశ్వ జననానికి కారణం లేదు. ఇక ముందు,మన శాస్త్రవేత్తలు, కారణం లేని విషయాలని శోధించటానికి కూడా తమ పరిశోధనలను ఉపయోగించవలసి వస్తుంది.
ఆస్తికులు “ఈ విశ్వమే భగవంతుడు కనే ఒక కల లాంటిది” అని అంటారు. కల అనేది నిద్రలో ఉంటుంది. నిద్ర అనేది ఒక మనిషి శారీరక మానసిక పరిస్థితులవలన మొదలౌతుంది. ఎవరైనా మనకు కలలో జరిగే సంఘటనల కార్యకారణ సంబంధాలద్వారా, కల యొక్క పుట్టుక కారణాన్ని (మనిషి మానసిక, దైహిక పరిస్థితి, నిద్ర) కనిపెట్టాలంటే అది దాదాపు అసంభవం. అలానే ఈ విశ్వంలోని కార్య కారణ సంబంధాలతో విశ్వం పుట్టుక ముందు ఏమి ఉందో అన్వేషించటం కష్టమవ్వవచ్చు. ఆస్తికుల విషయంలో, దేవుడు కనే కల లాంటిది ఈ విశ్వమైతే, మరి దేవుడిని ఎవరు సృష్టించారు? లేక, దేవుడు ఏదైన ఇంకా పెద్ద కలలోని వాడా? దీనికి సమాధానం, దేవుడు తను కనే కల(విశ్వం) లో భాగం కాదు.కాబట్టీ ఈ విశ్వం లోని సూత్రాలైన కార్య కారణ సంబంధాలను దేవుడికి అన్వయించలేము. దేవుడికి కారణం లేదు. మొత్తానికి సృష్టి జన్మ విషయానికి వచ్చేసరికి హేతువాదులూ, ఆస్తికులూ ఒకేరకమైన సమాధానాలు ఇస్తున్నారు. తేడా ఒక్కటే, ఆస్తికులు సృష్టి ఆదికి దేవుడిలో, ఒక మంచి లోక కల్యాణ కరమైన ఉద్దేశాన్ని (మోటివ్) చూస్తున్నారు. కానీ ఇక్కడ మనిషి, దేవుడిని మరీ తన రూపంలో ఊహించుకొంటున్నాడేమో! ఉద్దేశాలూ, ఇచ్చలూ మానవునికి ఉంటాయి. ఇవి అతనిలో జీవ పరిణామ పరంగా ఏర్పడతాయి. క్వార్క్లూ, పాజిట్రాన్లు ఏర్పడక ముందు జరిగిన బిగ్ బ్యాంగ్ కు భగవంతుడు కారకుడైతే, ఆయనకు జీవపరిణామం ద్వారా వచ్చిన “ఇఛ్ఛ” ను ఆపాదించటం సరి కాదేమో!ఇఛ్ఛ అనేది మనిషికి భౌతిక వాంఛల యొక్క పరిణామం వలన కలుగుతుంది కదా!
ఆస్తికత్వం దృష్టితో చూసినా, నాస్తికత్వ దృష్టితో చూసినా, మనం ఒక కారణం లేని మూలానికి వెళ్ళ వలసి వస్తోంది. కాబట్టీ, “ఈ విశ్వం పుట్టుక (లేక దేవుడు) కి కారణం లేదు”, అనటం హేతుబధ్ధమే!