విశ్వనాథ సాహిత్య అకాడమీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వనాథ సాహిత్య అకాడమీ గుంటూరు కేంద్రంగా పని చేస్తున్న సాహితీ, సాంస్కృతిక సంస్థ. ఈ సంస్థ మంచి సాహిత్య గ్రంథాలను ప్రచురించడం, కళా ప్రదర్శనలు నిర్వహించడం, ఏడాదికొకసారి కళారంగానికి సంబంధించిన వ్యక్తులకు విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం, విశ్వనాథ సంస్కృతి పురస్కారం అందచేస్తుంది.[1]

చరిత్ర[మార్చు]

పుస్తక ప్రచురణ[మార్చు]

  • సెప్టెంబర్ 2019 లో శ్రీరమణ దీర్ఘ కథ నాలుగో ఎకరం ప్రచురణ

పురస్కార గ్రహీతలు[మార్చు]

విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారం ఒక సంవత్సరం నాట్యంలో, తరువాత సంవత్సరం సాహిత్యంలో, తరువాత సంవత్సరం సంగీతంలో ప్రదానంచేస్తారు. కారణం ఆమెకి ఈ మూడు రంగాలలో ప్రవేశం ఉండటం. జానపద కళాకారులకు విశ్వనాథ సంస్కృతి పురస్కారం అందిస్తారు.

విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ పురస్కారం[మార్చు]

  1. 2017 - నాట్య రంగం - కళావంతుల నాట్య శైలిలో ప్రతిభావంతురాలైన డా. యశోదా ఠాకోర్, హైదరాబాద్
  2. 2018 - సాహిత్య రంగం - నాటక,సాహిత్య, నాట్య, జానపద కళా పరిశోధకులు ప్రొఫెసర్ మొదలి నాగభూషణశర్మ
  3. 2019 - సాహిత్య రంగం - గుంటూరులో త్యాగరాజ ఆరాధన సంఘం స్థాపించి గుంటూరులో శాస్త్రీయ సంగీత అభిరుచి ఇనుమడింపచేసిన శ్రీ బుర్రా సీతారామశాస్త్రి
  4. 2020 - సంగీతం, నాట్య రంగం - కథక్ నృత్య కళాకారిణి శరథిని గోలే

విశ్వనాథ సంస్కృతి పురస్కారం[మార్చు]

  1. 2019 లో తూర్పు భాగవతం కళాకారుడు బొంతలకోటి సాంబమూర్తి, కోమటిపల్లి (బొబ్బిలి వద్ద).
  2. 2020 లో తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "విశ్వనాథ సాహిత్య అకాడమీ కార్యక్రమాలు". ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి. 27 Jan 2020. Retrieved 26 March 2020.

బయటి లంకెలు[మార్చు]