విశ్వనాధ శబరి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విశ్వనాధ శబరి తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు వ్రాసిన గ్రంథం.
విషయ సూచిక
[మార్చు]- శబరి కథ,
- విశ్వనాధ వినూత్నరీతి,
- హంసీ-శబరి
- మన్మధ ప్రవేశము,
- రామ దర్శనము-శబరి పారవశ్యము,
- అగస్త్య వన ఫల రుచి - అగస్త్య తత్త్వము,
- సతనువు,ప్రాణనాధా!లీలామనోజ!అనుట ఏమి,
- మధుర భక్తి
- దేవరహస్యము,
- వైరాగ్య మన్మధ వైశిస్ట్యము,
- ముసలమ్మకు కామమెమిటి?
- స్బరి ఫల సమర్పణము
- శబరీ రాముల దివ్య సంభాషణము
- శబరిగురు భక్తి
- జ్ఞాన విజ్ఞానములు,
- చందో వైవిధ్యము,
- షట్పదీ నినాదము (శబరి రామస్తుతి)
- శబరి కథ చిత్రము,
- అవ్యయుని పంచ కళలు-శబరి,
- ద్యులోక దీధితి శబరి
- ఫలశృతి
- పండితాభిప్రాయములు,
- పద్య కవితాశీస్సులు .
ఈ గ్రంధమును గూర్చి
[మార్చు]ఉపనిషద్విజ్ఞానము,వేద రహస్యము,సంఖ్య యోగ రహస్యములు తెలిసినవారికి గాని శ్రీ రామాయణ భారతములు అంతు పట్టవు.శ్రీ విశ్వనాధ వారు సాధనగలవారు.ద్రష్టలు,జ్ఞానులు,ఉపాసకులు కూడా,కనుక వారి గూధమగు రామాయణాన్ని సామాన్యులు అర్ధం చేసుకోలేరు.శ్రీమాన్ రాజగోపాలాచార్యుల వారు వారి పితృపాదుల కటాక్షంచే ప్రకాశించిన అంతర్ద్రుష్టి కలవారు.కనుక విశ్వనాధ వారి శబరీ రామ సమాగమంలో ఆత్మ పరమాత్మ సమాగమంలో ఉండే సౌందర్యాన్ని రాసిక్యాన్ని,జ్ఞాన భక్తీ వైరాగ్య యోగముల సమ్మేళనముతో సాగిన శబరీ రహస్య తత్త్వాన్ని దర్శించి ,అనుభవించి ఆవిష్కరించారు.
- కల్పవృక్షచ్ఛాయల్లో శబరీ శ్రీ రాముల సంభాషణం వేరుగా కనిపిస్తుంది.ఇందులో ఉన్న అంతరార్ధం ఏమిటో తెలుసుకోవటం కష్టం.
అలాంటి శబరీ ఘట్టాన్ని శ్రీ రాజగోపాలాచార్యులు వారు మెల్లమెల్లగా పసిగట్టి వారి నాన్నగారి శిక్షణచేత తాత్వికమైన దృష్టి విస్వ్శం
కలవారగుట చేత అనేక విధములైన ప్రమాణాలతో మంచి వ్యాఖ్యానం చేశారు.
– రామాయణ రత్నాకర ఉ!వే!ప్ర! శ్రీమాన్ శ్రీ భాష్యం అప్పలాచార్యులు, విశాఖపట్నం
- కల్పవృక్షచ్ఛాయల్లో శబరీ శ్రీ రాముల సంభాషణం వేరుగా కనిపిస్తుంది.ఇందులో ఉన్న అంతరార్ధం ఏమిటో తెలుసుకోవటం కష్టం.
- నిరాశ లేని అనంత నిరీక్షణలోని మాధుర్య ఫలం శబరి.భగవదర్పితమైన ఒక వైజ్ఞానిక కుసుమం ఆమె.ఆ కుసుమ పరిమళమే ఈ రచన.
ఇదొక వైదిక దృష్టి,ఇదొక వైహాయన వీక్షణా సృష్టి.అది విశ్వనాధవారి జీవుని వేదన ఇది రాజగోపాలుని ఆత్మ నివేదన.
– శ్రీ కోగంటి సీతారామాచార్యులు, గుంటూరు
- నిరాశ లేని అనంత నిరీక్షణలోని మాధుర్య ఫలం శబరి.భగవదర్పితమైన ఒక వైజ్ఞానిక కుసుమం ఆమె.ఆ కుసుమ పరిమళమే ఈ రచన.
- ఇంకా ఏ ఏ అర్ధాలు చెబుతారో తరువాయి పుటల్లో అనే ఉత్కంఠతో పుస్తకం పూర్తిగా చదివాను.మరల మరల చదువవలసియున్నది.ప్రతి పేరా వెలుగుల్ని వెదజల్లుచున్నది.
– శ్రీ ఆచార్య తిరుమల, హైదరాబాదు
- ఇంకా ఏ ఏ అర్ధాలు చెబుతారో తరువాయి పుటల్లో అనే ఉత్కంఠతో పుస్తకం పూర్తిగా చదివాను.మరల మరల చదువవలసియున్నది.ప్రతి పేరా వెలుగుల్ని వెదజల్లుచున్నది.
- నీ "శబరి" చాలా బాగా ఉంది.నీవు శబరిలో "పరమహంసి"ని చూడగలిగినావు.విశ్వనాధవారు బ్రతికి ఉన్నచో నిన్ను కౌగిలించుకొని అభినందించి ఉండేవారు.
– శ్రీ ఏలేశ్వరపు రామకృష్ణ శాస్త్రి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం,వారణాశి
- నీ "శబరి" చాలా బాగా ఉంది.నీవు శబరిలో "పరమహంసి"ని చూడగలిగినావు.విశ్వనాధవారు బ్రతికి ఉన్నచో నిన్ను కౌగిలించుకొని అభినందించి ఉండేవారు.
- శబరి గాధను ఆధ్యాత్మిక రహస్యాలతొ హృదయంగమంగా ప్రచురించినందుకు అభినందనలు.
– శ్రీ నండూరి రామకృష్ణమాచార్య, హైదరాబాదు
- శబరి గాధను ఆధ్యాత్మిక రహస్యాలతొ హృదయంగమంగా ప్రచురించినందుకు అభినందనలు.
- శ్రీమంతంబగు "కల్పవృక్షము"న వైశిష్ట్యంబు లెన్నైన స
ద్ధీమంతుల్ కనుగొదురద్భుతములై దీపింప నవ్యార్ధముల్
రామాంతర్య మెఋంగ గల్గు శబరీ రామార్పిత స్వాంతమున్
తామై తెల్పిన "విస్వనాధు"దెలిపెన్ దా రాజగోపాలుడున్!!
– శ్రీ జానుమద్ది హనుమచ్చాస్త్రి, కడప
- శ్రీమంతంబగు "కల్పవృక్షము"న వైశిష్ట్యంబు లెన్నైన స
- ఏ తద్గ్రంధకర్త చి.డాక్తర్.శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు నాకు ఆత్మీయ ప్రియశిష్యుడు.అతడీ శబరి కథా సన్నివేశమును
ఒక మహాసభలో నా సమక్షమున ప్రసంగించినప్పుడు నౌగురూ పలువురూ మెచ్చినారు.ఆ మెప్పుదల అతనికి ప్రోద్బలకము
కాగా ఈ కృతినిట్లు అంతర్వాణివరేణ్యుల అంతరంగమునకు ఆహా పుట్టించునట్లు రూపొందించినాడు.
– పద్మశ్రీ డా. పి.బి.శ్రీనివాస్, సినీ నేపద్యగాయకులు , మద్రాసు
- ఏ తద్గ్రంధకర్త చి.డాక్తర్.శ్రీమత్తిరుమల వేంకట రాజగోపాలాచార్యులు నాకు ఆత్మీయ ప్రియశిష్యుడు.అతడీ శబరి కథా సన్నివేశమును
- ఈ వ్యాఖ్యానమును విశ్వనాధవారు విన్నచో తన రామాయణ కల్పవృక్ష రచన చరితార్ధమైనదని ఆనదాశ్రువులతో పులకాంకురములతో గద్గద స్వరముతో ఆనందించి యుండెడివారు.
– ప్రొఫెసర్ యస్.వి.జోగారావు, విశాఖపట్టణం
- ఈ వ్యాఖ్యానమును విశ్వనాధవారు విన్నచో తన రామాయణ కల్పవృక్ష రచన చరితార్ధమైనదని ఆనదాశ్రువులతో పులకాంకురములతో గద్గద స్వరముతో ఆనందించి యుండెడివారు.