విస్మృత యాత్రికుడు (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్మృత యాత్రికుడు (నవల)
కృతికర్త: రాహుల్ సాంకృత్యాయన్ (హిందీ మూలం)
ఆలూరు భుజంగరావు (అనువాదం)
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవిత చరిత్ర
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 1965
పేజీలు: 451


విస్మృత యాత్రికుడు అనేది ఒక తెలుగు అనువాద నవల. రాహుల్ సాంకృత్యాయన్ "విస్మృత యాత్రికుడు" హిందీ నవలను[1] ఆలూరు భుజంగరావు తెలుగులోకి అనువాదం చేశాడు. నరేంద్రుడనే బౌద్ధ భిక్షువు యొక్క ఆత్మకథా రూపంలో రాయబడిన నవల.

సారాశం[మార్చు]

ఆరవ శతాబ్దిలో ఇప్పటి పాకిస్థాన్ భూభాగంలో జన్మించిన నరేంద్రుడు బాల్యం లోనే బౌద్ధమఠంలో చేరి, సత్యాన్వేషణ, విద్యార్జన, బౌద్ధ ధర్మప్రచారం చేస్తూ భారతదేశం అంతా పరిభ్రమిస్తాడు. శ్రీ లంకలో భిక్షువుగా మారతాడు. భ్రమణకాంక్ష, బౌద్ధం అతణ్ణి ఒకచోట నిలవనియ్యవు. రష్యాలోని, సైబీరియా వరకూ, కజకస్థాన్ వంటి దేశాలు, దర్శించి, చివరకు చైనాలో భిక్షువుగా, మఠాధిపతిగా, వైద్యులుగా ఉంటూ అనేక బౌద్ధ మతగ్రంథాలను సంస్కృతం, పాళీ భాషలనుంచి చైనా భాషలోకి అనువదిస్తాడు.

నవల గురించి[మార్చు]

ఆత్మచరిత్ర రూపంలో రచించబడిన నవలలో బుద్దుని జీవితం, బోధనలు, ఆచరణ, బౌద్ధం సుదూర ప్రాంతాల్లో వ్యాపించిన వైనం, ద్వేషభావంతో కొందరు పాలకులు బౌద్ధాన్ని నిర్మూలించడానికి ప్రయత్నాలు, భిక్షువుల త్యాగమయజీవితం వివరాలతో నవల ఒక కొత్త కిటికీని తెరుస్తుంది. సాంకృత్యాయన్ నవల ద్వార మానవీయమైన అనేక విషయాలమీద పాఠకులకు కొత్తచూపు కలిగిస్తాడు.

స్వీయ అనుభవాలనే రాహుల్ నవలగా రాశాడు. ఆనాటి బౌద్ధ భిక్షువులు గడిపిన త్యాగమయ జీవితాన్ని, బుద్ధుని ప్రేమ, అహింసలను భిక్షువులు ఎలా సుదూర తీరాలకు చేర్చారో నవలలో వర్ణించబడింది.

నవలలోని కొన్ని వాక్యాలు[మార్చు]

  • యాత్రాచరిత్రలు "చదవడం వలన మానవుడి బుద్ధి వికసిస్తుంది.
  • ఒకదేశం సుందరమైనదనిగానీ మరొక దేశం సౌందర్య రహితం అనిగానీ అనడం గొప్ప మూర్ఖత్వం.
  • సంగీతం విషయంలోనూ ప్రతిజాతి ప్రత్యేకమైన అభిప్రాయం కలిగి ఉంటుంది.
  • దేశాటన మానవునిలోని అనేకమైన మూఢనమ్మకాలనూ, భ్రాంతులనూ దూరంచేస్తుంది.
  • దుఖం ఉన్నదని తథాగతుడు ఒప్పుకున్నాడు..ఆ దుఃఖాన్నుండి విముక్తి మార్గంకూడా ప్రసాదించాడు. ఆయన చూపిన మార్గం బహుజన హితం, బహుజన సుఖం…స్వార్థాంధకారాన్ని బాపడంకోసం బుద్ధుడు బోధిప్రదీపాన్ని వెలిగించాడు.
  • ఉద్యానదేశం అతిశీతల ప్రదేశం కావడం వలన అక్కడి ప్రజలు రోజూ స్నానం చేయరు. అందుకని వారిని హేళన చేయడమో, నిందించడమో, లేక అసహ్యించుకోడమో తగదు.
  • అన్నదమ్ములందరూ ఒకస్త్రీని వివాహమాడే విషయం భారతంలోమాత్రం చదవగలం. కానీ , అలాంటి వివాహాలు సహజమైన ఆచారాలుగా పాటిస్తూ ఉండే దేశాల్లో నేను పర్యటించాను. వివిధదేశాల్లోని ఆచారాల వ్యత్యాసాల్ని తెలుసుకున్న తర్వాత, సామాజిక ఆచారాలపట్ల మానవుడు తన దురాగ్రహాన్నీ, మొండి పట్టునూ విడనాడు.

మూలాలు[మార్చు]

  1. "రాహుల్‌ సాంకృత్యాయన్‌.. ఓ దీపస్తంభం". Prajasakti (in ఇంగ్లీష్). 2022-04-18. Archived from the original on 2022-04-18. Retrieved 2023-07-15.

రాహుల్ సాంకృత్యాయన్ "విస్మృత యాత్రికుడు"హిందీ నవలకు ఆలూరి భుజంగరావు తెలుగు అనువాదం, పల్లవి ప్రచురణ, విజయవాడ, 2023.

బయటి లింకులు[మార్చు]