Jump to content

వి.ఆర్. ఎలీజా

వికీపీడియా నుండి
వి.ఆర్. ఎలీజా
వి.ఆర్. ఎలీజా


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 3 జూన్ 2024
ముందు పీతల సుజాత
తరువాత సొంగ రోషన్ కుమార్
నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1961
చింతలపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు సుబ్బారావు
జీవిత భాగస్వామి ఝాన్సీలక్ష్మీబాయి.
సంతానం ఇద్దరు కుమారులు
నివాసం నందమూరి విద్యానగర్ కాలనీ, చింతలపూడి

ఉన్నమట్ల ర‌క‌డ ఎలీజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2019లో చింతలపూడి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

వి.ఆర్. ఎలీజా 1961లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమ గోదావరి జిల్లా, చింతలపూడి లో జన్మించాడు. ఆయన ఏలూరు లోని సర్ సి.ఆర్. రెడ్డి డిగ్రీ కాలేజీ నుండి 1980లో బీఏ పూర్తి చేశాడు. వీఆర్‌ ఎలీజ 1990లో సివిల్‌ సర్వీసెస్‌లో ఐఆర్‌ఎస్‌ కు ఎంపికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆయన 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కర్రా రాజారావు పై 36175 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.ఆయన చింతలపూడి ఎమ్మెల్యేగా జూన్ 12, 2019న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశాడు.

సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజాను కాదని 2024లో ఎన్నికల్లో చింతలపూడి అభ్యర్థిగా కంభం విజయరాజును వైఎస్ జగన్ ప్రకటించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన 2024 మార్చి 24న వైసీపీకి రాజీనామా చేసి హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 October 2021). "Chintalapudi Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 14 October 2021. Retrieved 14 October 2021.
  2. Sakshi (18 March 2019). "శాసనసభా స్థానాల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 9 October 2021. Retrieved 9 October 2021.
  3. Andhrajyothy (24 March 2024). "వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మరో ఎమ్మెల్యే". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.