పీతల సుజాత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పీతల సుజాత


వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 సెప్టెంబర్ 24

స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - 2019
ముందు మద్దాల రాజేష్ కుమార్
తరువాత వి.ఆర్. ఎలీజా
నియోజకవర్గం చింతలపూడి

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009
ముందు జోహార్ మోచర్ల
తరువాత పీతాని సత్యనారాయణ
నియోజకవర్గం ఆచంట

వ్యక్తిగత వివరాలు

జననం 1961
చింతలపూడి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు పీతల బాబ్జి
నివాసం చింతలపూడి

పీతల సుజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక రాజకీయ నాయకురాలు. ఆమె 2004లో ఆచంట నియోజకవర్గం నుండి, 2014లో చింతలపూడి నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టింది.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

పీతల సుజాత 2014 సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రిమండలిలో స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా పని చేసింది.[2] ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత తండ్రి పీతల బాబ్జి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చింది.[3] 2004లో తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందింది.[4] ఈమె వయస్సు 41 సంవత్సరాలు. భర్త సురేష్‌కుమార్. వీరికి ఒక కుమారుడు.

పీతల సుజాతను రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్‌పర్సన్‌గా 2024 సెప్టెంబర్ 24న ప్రభుత్వం నియమించింది.[5]

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (23 June 2024). "ఈ మహిళా మంత్రులంతా ఒకప్పటి టీచర్లే.! వీడియో." Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Sakshi (14 April 2016). "పీతల సుజాత తీవ్ర మనస్థాపం". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.
  3. TV9 Telugu (12 September 2019). "మాజీ మంత్రి పీతల సుజాతకు పితృ వియోగం..!". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Profile of Peethala Sujatha". helloap.com. Retrieved 2015-04-13.
  5. Eenadu (25 September 2024). "నామినేటెడ్‌ నజరానా". Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.

బయటి లంకెలు

[మార్చు]