వి. ఎస్. శ్రీనివాస శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వలంగైమాన్ శంకరనారాయణ శ్రీనివాస శాస్త్రి
1921లో వీ. ఎస్. శ్రీనివాస శాస్త్రి
దక్షిణాఫ్రికా యూనియన్ కి భారతీయ ఏజెంటు
In office
1927 జూన్ – 1929 జనవరి
చక్రవర్తిఐదవ జార్జి
గవర్నర్ జనరల్ఎడ్వర్డ్ వుడ్
అంతకు ముందు వారుఎవరూ లేరు
తరువాత వారుకూర్మా వెంకట రెడ్డి నాయుడు
కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడు
In office
1920–1925
చక్రవర్తిఐదవ జార్జి
వ్యక్తిగత వివరాలు
జననం(1869-09-22)1869 సెప్టెంబరు 22
వలంగైమాన్, తంజావూరు జిల్లా
మరణం1946 ఏప్రిల్ 17(1946-04-17) (వయసు 76)
మైలాపూర్, మద్రాసు
జాతీయతబ్రిటిష్ ఇండియా
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్ (1908–1922),
ఇండియన్ లిబరల్ పార్టీ (1922–1946)
జీవిత భాగస్వామిపార్వతి
కళాశాలనేటివ్ హైస్కూలు, కుంబకోణం
ప్రభుత్వ కళాశాల, కుంబకోణం
వృత్తిహెడ్మాస్టర్
నైపుణ్యంవిద్యావేత్త, ప్రసంగకర్త, రచయిత, రాజకీయ నాయకుడు, దౌత్యవేత్త

వలంగైమాన్ శంకరనారాయణ శ్రీనివాస శాస్త్రి, సిహెచ్ పీసీ (22 సెప్టెంబర్ 1869-17 ఏప్రిల్ 1946) భారతీయ రాజకీయవేత్త, నిర్వాహకుడు, విద్యావేత్త, వక్త, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. ఆయన ప్రసంగధోరణి, ఆంగ్లభాషా ప్రావీణ్యం చాలా సుప్రసిద్ధి చెందింది.[1][2] శ్రీనివాస శాస్త్రి భారతదేశంలోని కుంభకోణం సమీపంలోని వలంగైమాన్ గ్రామంలో ఒక పేద ఆలయ పూజారికి జన్మించాడు. ఆయన కుంభకోణంలో తన విద్యను పూర్తి చేసి, పాఠశాల ఉపాధ్యాయుడిగా, తరువాత మద్రాసు ట్రిప్లికేన్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీలో చేరడంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. శాస్త్రి 1908 నుండి 1922 వరకు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశాడు, కానీ, తరువాత సహాయ నిరాకరణ ఉద్యమానికి నిరసనగా రాజీనామా చేశారు. ఇండియన్ లిబరల్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో శాస్త్రి ఒకరు. తన చివరిరోజుల్లో, అతను భారత విభజనను తీవ్రంగా వ్యతిరేకించాడు.[3]

శ్రీనివాస శాస్త్రి 1913 నుండి 1916 వరకు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోనూ, 1916 నుండి 1919 వరకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోనూ, 1920 నుండి 1925 వరకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ సభ్యుడిగానూ పనిచేశాడు. శాస్త్రి లీగ్ ఆఫ్ నేషన్స్ భారత ప్రతినిధిగానూ, యునైటెడ్ కింగ్డమ్ లోని ప్రైవీ కౌన్సిల్ సభ్యుడిగానూ, యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఏజెంట్గానూ కూడా పనిచేశాడు.[4][5][6]

ఆంగ్ల భాషలో నైపుణ్యానికి శాస్త్రి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని పొందాడు. అతను రాజకీయాల్లో గోపాల కృష్ణ గోఖలేకి సన్నిహిత సహచరుడు. శాస్త్రి మహాత్మా గాంధీ సన్నిహిత మిత్రుడు, సహచరుడు కూడా, గాంధీ తన రచనలలో శాస్త్రిని తన "అన్నయ్య" గా సంబోధించాడు. శాస్త్రి 1930లో ఆర్డర్ ఆఫ్ ది కంపానియన్స్ ఆఫ్ ఆనర్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. 1921లో ఫ్రీడమ్ ఆఫ్ లండన్ అన్న గౌరవాన్ని ఆయనకు ప్రదానం చేశారు, 1931లో ఫ్రీడమ్ ఆఫ్ ఎడిన్బర్గ్ అన్న గౌరవాన్నీ అందుకున్నాడు.[7]

అయితే, నెహ్రూ వంటి భారత స్వాతంత్ర్యోద్యమ నాయకులు కొంతమంది శాస్త్రికి బ్రిటిష్ పాలకుల పట్ల సానుభూతి బాగా ఎక్కువనీ, వారితో చాలా ఎక్కువగా సహకరిస్తున్నాడనీ భావించారు. ఇది ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశాలలో స్పష్టంగా కనిపించింది, ఇక్కడ శాస్త్రి, తన పార్టీ సభ్యునితో సహా బ్రిటిష్ వారి అన్యాయమైన ప్రతిపాదనలను అంగీకరించాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. CHAPTER XIII: V.S.Srinlvasa Sastrl (1869 - 1946) (PDF). pp. 250–290.
  2. "V.S.Srinivasa Shastri | Prekshaa". www.prekshaa.in. Retrieved 2020-03-13.
  3. The Houghton Mifflin Dictionary of Biography. Houghton Mifflin Harcourt. 2003. p. 1350. ISBN 978-0-618-25210-7.
  4. "Second Session of the Assembly". League of Nations Photo Archive. University of Indiana.
  5. Mohan Lal (2006). Encyclopaedia of Indian Literature, Volume 5. Sahitya Akademi. p. 4175. ISBN 978-81-260-1221-3.
  6. "South African History Timelines – 1920s". South African History Online (SAHO). Archived from the original on 14 October 2009. Retrieved 18 October 2009.
  7. "Freedom of the city of Edinburgh". Archived from the original on 2 September 2012.
  8. Jawaharlal Nehru (1945). An Autobiography (1 ed.). Calcutta: Bodell.