Jump to content

వీధిపురాణం

వికీపీడియా నుండి

విజ్ఞలు చెప్పిన వీధి పురాణం.

[మార్చు]

పూర్వ్ం పలలెల్లో మహాభారతం, భాగవతం, రామాయణం, గరుడ పురాణం, బసవ పురాణం, దేవీ భాగవతం మొదలైన పురాణ గాథలను చదవటం తేట తెలుగులో గ్రామ ప్రజలకు అర్థమయ్యే శైలిలో చెప్పడం ఆనాడు ఆచారంగా వుండేది. ఆనాటి ముఖ్యమైన వినోదాలలో వీధి పురాణం చెప్పడం ఒకటి. గ్రామంలోని ధనికులు, గ్రామ రెడ్లు, పండితులు, బ్రాహ్మణులు మొదలైన వారు నిర్వహించే వారు. పురాణ పఠనం వీధి మంటపంలో గాని, గ్రామ చావడిలో గాని చెప్పేవారు. పురాణ పఠనానికి ఏ విధమైన ఖర్చూ లేదు. భక్తీ, ముక్తీ రెండూ కలుగు తాయనీ విశ్వాసంతో ఎంతో మంది ఈ పౌరాణ పాథణానికి హాజరయ్యే వారు. ప్రేక్షకులు వచ్చే వారు వస్తూ వుంటే వెళ్ళి పోయే వారఉపెళ్ళి పోతూ వుండే వారు. ఏ మాత్రం కొంచెం తీరిక వున్నా కాస్త పురాణ కాలక్షేపం విని పోయే వారు. అంతే గాక, ఈ పఠనం సాయంత్రం పూట తీరుబడి వేళ జరిగేది. ఒకరు పురాణం చదివితే, మరొకరు విడమర్చి ఆర్థం చెప్పేవారు. గ్రామంలో వుండే పురుషులు ఏ మాత్రం అవకాశమున్నా వీథుల్లోనే వుండే వారు. ఆ నాటి వినోద కార్య క్రమాలన్నీ వీధుల్లోనే జరిగేది.

వీధి పురాణం యొక్క ప్రాముఖ్యాన్ని గూర్చి చంద్ర శేఖరుడు ఆనాటి జానపద కళారూపాలను తన శతకంలో వర్ణిస్తూ వీథి పౌరాణం యొక్క ప్రాముఖ్యాన్ని గూర్చి ఈ క్రింది విధంగా ఉదహరించాడు. .............................

పద్యం

పండిన చేను నాది, పడమోసుకుపో నెల నాడు నీవు పుర్రాండము సెప్పినావు గద బలె రమ్మెముగా బగుమా నమిన, మా ముండ ఇలాలటంట, పది మొత్తుకు సచ్చెను నీవు మల్లి రామాండము సెప్పలంచు ననుమందుడు మూర్ఖుడు చంద్ర శేఖరా||

అని వర్ణించాడు. అంటే ఆనాడు వీథి పురాణం కూడ ఎంతటి బల వత్తరమైన కళారూపమో ఆర్థం చేసు కోవచ్చు.

మూలాలు

[మార్చు]


                       )))0(((