Jump to content

వీరాభిమన్యు (1936 సినిమా)

వికీపీడియా నుండి

' వీర అభిమన్యు ' తెలుగు చలన చిత్రం ,1936, అక్టోబర్ 24 న విడుదల . సెలెక్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో, పులిపాటి వెంకటేశ్వర్లు ,కాంచనమాల, సురభి కమలాబాయి నటించారు. వి . డి . అమీన్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇదే పేరుతో 1965లో వచ్చిన సినిమా వివరాలకోసం వీరాభిమన్యు (1965 సినిమా) చూడండి.

వీరాభిమన్యు
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.డి.అమిన్
తారాగణం కాంచనమాల
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

వీరాభిమన్యు 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.డి.అమిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాంచనమాల నటించింది.

నటవర్గం

[మార్చు]
  • కాంచనమాల
  • పులిపాటి వెంకటేశ్వర్లు
  • మంత్రవాది వెంకట జోగారావు
  • సంధ్యారం వెంకటేశ్వర్లు
  • నాగరత్నం
  • సురభి కమలాబాయి
  • హైమావతి
  • సింగరాజు నాగభూషణరావు

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకుడు: వి.డి.అమిన్
  • శబ్దగ్రహాకులు: బి.ఆర్.పటేల్
  • నిర్మాణ సంస్థ: సెలెక్ట్ పిక్చర్స్ సర్క్యూట్
  • గీత, పద్య రచన: సంధ్యారo వెంకటేశ్వర్లు
  • నేపథ్య గానం: పులిపాటి వెంకటేశ్వర్లు, శ్రీహరి,కాంచనమాల, సురభి కమలాబాయి, మాల్పూరి దక్షిణామూర్తి , నాగరత్నం, చెరువు శివరామశాస్త్రి
  • విడుదల:1936: అక్టోబర్:24.


పాటల జాబితా

[మార్చు]

గీత, పద్య రచన: సంద్యారం వెంకటేశ్వర్లు.

1. కృష్ణా మురారీ వినుతు జేతు నినుహరి

2.ఖండ ఖండములుగా చెండేదన్ కురుకుల కాంతార, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

3.జయవీరా జయశూరు జయపాండు నరపాల , గానం.బృందం

4.తనయా ఇంత దుడుకా మామఎడల, గానం.సురభి కమలాబాయి

5.నా తనయా సుకుమారా ఈనాటికీ నాకోరిక , గానం.సురభి కమలాబాయి

6.పగతుర మదహరివై సంగ్రామమున జయీంపన్, గానం. సురభి కమలాబాయి

7.ప్రణయ మధుర వాంచితంభు ఫలరూపము దాల్చు, గానం.కాంచనమాల

8.ప్రాణకాంతా కనరాధా భవదీయ మృదుమధుర , గానం.కాంచనమాల

9.ప్రాణానాథా పల్కదగునే అన్యమెరుగని నన్నిటు, గానం.కాంచనమాల

10.ప్రియా చనమా అనికిన్ వడిగా సన్నాహ వీరుండవై , గానం.కాంచనమాల .

పద్యాలు

[మార్చు]

1.అర్జునాత్మజ దివ్య బాణములు గనగా, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

2.అస్త్రనిది నటంచు నాదరింతునే నిన్ను అర్జునుడు, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

3.ఇతని శత్రువు మరుడౌట యెరిగియుండి, గానం.శ్రీహరి

4.కలికిరమ్మని జీరినన్ గౌగలించి, గానం.కాంచనమాల

5.గగనవీధిని మబ్బులు గలయుగాదే , గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

6.గురుడు యుద్దంబునకు వచ్చి కొంతపోరి, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

7.నీదు కన్గవ కెంపును నెగడునేని యీల్గు పదునాల్గు, గానం.మాల్ఫూరి దక్షిణామూర్తి

8.పరమసాద్విని మున్ను ద్రౌపదిని సభను, గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

9.ప్రజ్ఞలభిమన్యు డింకను బల్కనేల, గానం.నాగరత్నం

10.ప్రణయ నౌకను నిల్పి నీరధిని జేర్చి ముంచిపోయే, గానం.కాంచనమాల

11.ప్రాణానాథా మీరు నిజంబే పల్కినారు , గానం.కాంచనమాల

12.బద్రగుణ నీదు తల్లి సుభద్ర ఆమె,

13.వనటను బొందనేల వనవాసము నందు , గానం.పులిపాటి వెంకటేశ్వర్లు

14.వినుము హితమ్ము పాండవులు విక్రయవంతులే, గానం.మాల్ఫూరి దక్షిణామూర్తి

15.శత్రుదుర్బ్యూతమున సర్వ సంపదలన్, గానం.సురభి కమలాబాయి

16.సంధి గావింపనింతు దుస్సందుడైన , గానం.చెరువు శివరామశాస్త్రి

17.సకిత సంతనమయ్యే నీ సౌమ్యమూర్తి , గానం.పులిపాటి వెంకటేశ్వర్లు .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.