Jump to content

వీర్నాల జయరామారావు

వికీపీడియా నుండి
వీర్నాల జయరామారావు
జననం (1951-10-09) 1951 అక్టోబరు 9 (వయసు 73)
పిఠాపురం, ఆంధ్రప్రదేశ్
వృత్తికూచిపూడి కళాకారుడు, నాట్యగురువు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కూచిపూడి
జీవిత భాగస్వామివనశ్రీరావు
పిల్లలు1
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
సంగీత నాటక అకాడమీ అవార్డు
వెబ్‌సైటుhttps://www.facebook.com/thekda/info/?tab=page_info

వీర్నాల జయరామారావు పేరుపొందిన కూచిపూడి నృత్యకళాకారుడు, గురువు.

విశేషాలు

[మార్చు]

ఇతడు శాస్త్రీయ కళాకారుల కుటుంబంలో 1951, అక్టోబరు 9వ తేదీన పిఠాపురం పట్టణంలో జన్మించాడు.[1] ఇతడు కూచిపూడి గ్రామంలోని సిద్ధేంద్ర కళాక్షేత్రంలో కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు. తరువాత వెంపటి చినసత్యం వద్ద తన కళను మెరుగు పరుచుకున్నాడు.

ఇతడు ఢిల్లీకి తరలివెళ్ళి అక్కడ కూచిపూడి నాట్యశిక్షణ కోసం కూచిపూడి డాన్స్ అకాడమీ అనే సంస్థను ప్రారంభించి అనేక మందికి కూచిపూడి నాట్యకళలో నిష్ణాతులుగా తయారు చేశాడు. ఇతని వద్ద శిక్షణ తీసుకున్న వారిలో స్వప్నసుందరి, మీనాక్షి శేషాద్రి, వనశ్రీ రావు (భార్య) మొదలైన వారున్నారు.[2]

ఇతడు భారత ప్రభుత్వపు ప్రజావనరుల అభివృద్ధి సంస్థలో కూచిపూడి నాట్యానికి సంబంధించిన నిపుణుల కమిటీలో సభ్యునిగా నియమించబడ్డాడు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సభ్యులుగా ఇతడు, ఇతని భార్య వనశ్రీ రావు ప్రపంచంలోని 60 దేశాలకు పైగా సందర్శించి అక్కడ కూచ్చిపూడి నృత్యప్రదర్శనలు ఇచ్చారు. దేశ,విదేశాలలో జరిగిన దాదాపు అన్ని ముఖ్యమైన నృత్యోత్సవాలలో ఈ జంట పాల్గొన్నది.

ఇతడు కూచిపూడి నాట్యంలో చేసిన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు, సత్కారాలు పొందాడు. వాటిలో పద్మశ్రీ పురస్కారం (2004), సంగీత నాటక అకాడమీ అవార్డు, ఢిల్లీ స్టేట్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సన్మానం, ఇందిరా ప్రియదర్శిని అవార్డు (2003), షణ్ముఖానంద సభ వారిచే "నాట్యరత్న అవార్డు" (2005) మొదలైనవి ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. web master. "ARTISTE'S PROFILE". Centre for Cultural Resources and Training. Ministry of Culture, Government of India. Retrieved 21 May 2021.
  2. Kumar, Ranee (2017-07-17). "With an eye for aesthetics". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2021-05-21.

బయటి లింకులు

[మార్చు]