వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ | |
---|---|
ఇతర పేర్లు | వి.ఎఫ్. |
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ చూపిస్తున్న ఇ .సి.జి. | |
ప్రత్యేకత | కార్డియాలజీ |
లక్షణాలు | గుండె పోటు, దడ, స్పృహ కోల్పోవడం, నాడి అందదు |
కారణాలు | కొరోనరీ హార్ట్ డిసీస్, వాల్వ్యులర్ హార్ట్ డిసీస్, కార్డియోమయోపతి, బ్రుగడా సిండ్రోమ్, లాంగ్ క్యూ.టి. సిండ్రోమ్ లేదా ఎలక్ట్రిక్ షాక్ లేదా ఇంట్రాక్రేనియల్ రక్తస్రావము |
రోగనిర్ధారణ పద్ధతి | ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ఇసిజి) |
భేదాత్మక రోగనిర్థారణ పద్ధతి | టోర్సాడెస్ డి పాయింట్స్ |
చికిత్స | కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం (సి.పి.ఆర్) |
ఔషధం | ఎపినెఫ్రిన్ లేదా అమియోడారోన్ |
రోగ నిరూపణ | మనుగడ రేట్లు సుమారు 17% కాగా ఆసుపత్రిలో ఇది 46%. |
తరుచుదనము | గుండె పోటు ఉన్న 10% మందిలో ప్రారంభంలో ఈ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ పరిస్థితి కనిపిస్తుంది |
వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ (V-fib లేదా VF) అనేది గుండె జఠరికలలో రక్త ప్రసరణ సాధారణంగా జరుగకుండా కంపించడము వలన ఏర్పడిన అసాధారణ (గుండె) లయ. [1] గుండెలో నాలుగు గదులుంటాయి. పైన రెండు గదులలో గుడ్ లయ తప్పడాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా ఏ.ఎఫ్. అంటారు. గుండె క్రింద రెండు గదులలో గుండె వేగం పెరిగినప్పుడు వెంట్రిక్యూలర్ ఫిబ్రిలేషన్ (వి.ఎఫ్. ) అంటారు.[2]
కొరోనరీ గుండె జబ్బులు, వాల్వ్యులర్ గుండె జబ్బులు, కార్డియోమయోపతి, బ్రుగడా సిండ్రోమ్, లాంగ్ క్యూ.టి. సిండ్రోమ్ లేదా ఎలక్ట్రిక్ షాక్ లేదా ఇంట్రాక్రానియల్ రక్తస్రావము కారణంగా వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ సంభవించవచ్చు.[3][1][4] ఎలెక్ట్రాకార్డియోగ్రామ్ (ఇసిజి) ద్వారా రోగ నిర్ధారణ జరుగుతుంది.[1] ఒక ముఖ్యమైన రోగనిర్ధారణ ఏమంటే టోర్సాడెస్ డి పాయింట్స్ (నిర్దుష్టమైన గుండె అసాధారణమైన లయ). ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు గుండె లయ వి.ఎఫ్.లో నిముషానికి 300 పైగా పెరుగవచ్చు. గుండె కొట్టుకోవడం ఆగే ప్రమాదం ఉంటుంది. [2]
చికిత్సలో కార్డియోపల్మోనరీ పునరుజ్జీవనం (సి.పి.ఆర్ - cardiopulmonary resuscitation ) ఇంకా డీఫిబ్రిలేషన్ ఉంటుంది.[5] ప్రారంభ చికిత్సలు ప్రభావవంతంగా లేకపోతే ఎపినెఫ్రిన్ లేదా అమియోడారోన్ మందులు ఉపయోగిస్తారు.[1] 'అరిథ్మియా' ను గుర్తించినప్పుడు ఆసుపత్రి నుండి బయటపడిన వారిలో మనుగడ రేట్లు సుమారు 17% కాగా ఆసుపత్రిలో ఇది 46%.[6][1]
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 . "Ventricular Tachycardias: Characteristics and Management.".
- ↑ 2.0 2.1 డా.గుడపాటి, రమేష్ (2024-09-14). "గుప్పెడంత గుండె పై ఉప్పెనంత ఒత్తిడి". ఈనాడు.
- ↑ "Types of Arrhythmia". NHLBI. July 1, 2011. Archived from the original on 7 June 2015. Retrieved 7 September 2016.
- ↑ Barash, Paul G. (2009). Clinical Anesthesia (in ఇంగ్లీష్). Lippincott Williams & Wilkins. p. 168. ISBN 9780781787635. Archived from the original on 2017-08-08.
- ↑ (3 November 2015). "Part 1: Executive Summary: 2015 American Heart Association Guidelines Update for Cardiopulmonary Resuscitation and Emergency Cardiovascular Care.".
- ↑ (November 2010). "Global incidences of out-of-hospital cardiac arrest and survival rates: Systematic review of 67 prospective studies.".