ఎట్రియల్ ఫిబ్రిలేషన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎట్రియల్ ఫిబ్రిలేషన్
ఇతర పేర్లుకర్ణిక దడ
ఎలక్ట్రో కార్డియోగ్రామ్ V4, V5 హృదయ స్పందనల క్రమరహిత విరామాలు
ప్రత్యేకతకార్డియాలజీ
లక్షణాలుగుండె దడ, మూర్ఛ, తేలికపాటి తలనొప్పి, శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి
సంక్లిష్టతలుస్ట్రోక్
సాధారణ ప్రారంభం50 సంవత్సరాల పైన
ప్రమాద కారకములుఅధిక రక్తపోటు, కవాట గుండె జబ్బులు, గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, సి. ఓ. పి. డి, ఊబకాయం స్లీప్ అప్నియా, అధిక మద్యపానం, పొగాకు ధూమపానం, డయాబెటిస్ మెల్లిటస్, థైరోటాక్సికోసిస్
రోగనిర్ధారణ పద్ధతినాడి, ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ (ECG)
చికిత్సబరువు తగ్గడం, శారీరక శ్రమ, మద్యం తాగడం తగ్గించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు
తరుచుదనము2.5% అభివృద్ధి చెందిన దేశాలలో , 0.5% అభివృద్ధి చెందుతున్న దేశాలలో
మరణాలు193,300

కర్ణిక దడ (ఎ.ఎఫ్. లేదా ఎ.ఫైబిల్) అనేది గుండె కర్ణికల వేగవంతముగా క్రమరహితంగా కంపించడము వలన గుండె లయ (ఆర్రిథమియా) అసాధారణంగా ఏర్పడుతుంది.[1] ప్రారంభంలో ఇది తరచుగా స్వల్ప కాలం అసాధారణముగా కంపిస్తుంది. ఇది కాలక్రమేణా ఎక్కువగా లేదా నిరంతరంగా మారుతుంది.[2] ఇది కర్ణిక కంపించడం (AFL - Atrial Flutter) వంటి ఇతర రకాల అరిథ్మియాగా కూడా ప్రారంభమవుతుంది, తరువాత అది ఎ.ఎఫ్.గా మారుతుంది. [3]

గుండెలో నాలుగు గదులుంటాయి. పైన రెండు గదులలో గుడ్ లయ తప్పడాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేదా ఏ.ఎఫ్. అంటారు. గుండె క్రింద రెండు గదులలో గుండె వేగం పెరిగినప్పుడు వెంట్రిక్యూలర్ టెకికార్డియా, వెంట్రిక్యూలర్ ఫిబ్రిలేషన్ (వి.ఎఫ్. ) వంటి సమస్యలు ఏర్పడుతాయి.[4]

లక్షణాలు

[మార్చు]

తరచుగా ఈ దడ వచ్చినప్పుడు లక్షణాలు ఉండవు.[5] అప్పుడప్పుడు గుండె దడ, మూర్ఛ, తేలికపాటి తలనొప్పి, నీరసము, కళ్ళు చీకట్లు కమ్మడం , కళ్ళు తిరగడం , ఆయాసం, శ్వాస ఆడకపోవడం లేదా ఛాతీ నొప్పి ఉండవచ్చు.[4][6] ఈ వ్యాధి గుండె వైఫల్యం, చిత్తవైకల్యం, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.[7] ఇది ఒక రకమైన సూప్రావెంట్రిక్యులర్ టెకికార్డియా (గుండె ఎగువ భాగంలో విద్యుత్ చర్య సరిగ్గా లేని కారణంగా గుండె లయ క్రమరహితంగా ఉండడము ఉత్పన్నమవుతుంది).[8] ఎ.ఎఫ్.ఉన్నవారిలో ఒక్కొక్కసారి గుండె గదులలో రక్తం గడ్డ కట్టడం సంభవించడం , ఈ రక్తం మెదడుకు చేరి పక్షవాతం రావడం, కాళ్లకు చేరి గాంగ్రీన్ రావడం వంటి పరిస్థితులు ఉంటాయి.[4]

కారణాలు

[మార్చు]

అధిక రక్తపోటు, కవాట గుండె జబ్బులు ఎ.ఎఫ్.కి అత్యంత సాధారణ ప్రమాద కారకాలు [9][10] గుండె సంబంధిత ఇతర ప్రమాద కారకాలలో గుండె వైఫల్యం, కొరోనరీ ఆర్టరీ వ్యాధి, కార్డియోమయోపతి, పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు ఉన్నాయి.[9] అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో, కవాట గుండె జబ్బు తరచుగా రుమాటిక్ జ్వరం ఫలితంగా సంభవిస్తుంది.[11] ఊపిరితిత్తుల సంబంధిత ప్రమాద కారకాలలో సి.ఓ.పి.డి, ఊబకాయం స్లీప్ అప్నియా ఉన్నాయి.[5] ఇతర కారణాలలో అధిక మద్యపానం, పొగాకు ధూమపానం, డయాబెటిస్ మెల్లిటస్, థైరోటాక్సికోసిస్ వంటివి ఉన్నాయి.[11]

వృత్తి పరమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న వారిలో ఏ.ఎఫ్. ముప్పు అధికమని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనాలలో వెల్లడయింది . సాధారణంగా గుండె కొట్టుకునే వేగం నిముషానికి 60 నుంచి 100 సార్లు ఉండగా ఏ.ఎఫ్. లో గుండె లయ 180 నుంచి 200 సార్లకు పెరగవచ్చు.[4]

నిర్ధారణ

[మార్చు]

అయితే, సగం కేసులు ఈ ప్రమాదాలతో సంబంధం కలిగి ఉండవు.[5] ఆరోగ్య నిపుణులు నాడిని చూసి ఎ.ఎఫ్. ని అనుమానించగలరు. ఇంకా ఎలెక్ట్రోకార్డియోగ్రామ్ (ECG) కొలమానాలు, 2డి ఎఖో ను అన్వయించడం ద్వారా రోగ నిర్ధారణను చేస్తారు. ఒక సాధారణ ECG లో ఎ.ఎఫ్. ఉన్నప్పుడు P తరంగాలు క్రమరహిత వెంట్రిక్యులర్ కంపనను చూపదు[12] హోల్టర్ టెస్ట్ (ఒక పరికరాన్ని గుండెకి అనుసంధానం చేసి శరీరం పైభాగంలో అమర్చుతారు. ఇది రోజులో గుండె కొట్టుకునే విధానాన్ని నమోదు చేస్తుంది. కొందరిలో ఒక రోజునుంచి, ఒకటి, రెండు వారాలు కూడా పరీక్ష చేస్తారు) ద్వారా నిర్ధారిస్తారు.[4]

నివారణ, చికిత్స

[మార్చు]

ఊబకాయం ఉన్నవారిలో బరువు తగ్గడం, శారీరక శ్రమ పెంచుకోవడం, మద్యం తాగడం తగ్గించడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు, వ్యాయామం , సరిఅయిన నిద్ర, కర్ణిక దడ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. దడ సంభవిస్తే దాని ఉధృతాన్ని తగ్గిస్తాయి.[13] ఎ.ఎఫ్. లో గుండె రేటు ఒక సాధారణ నియంత్రణ స్థాయికి లేదా సాధారణ సైనస్ లయ స్థాయికి (లయ నియంత్రణ అని పిలుస్తున్నారు) మార్చడానికి మందులుతో చికిత్స చేస్తారు.[8] ఎలక్ట్రికల్ కార్డియోవర్షన్ ఎ.ఎఫ్. ను సాధారణ గుండె లయగా మార్చగలదు. వ్యక్తి అస్థిరంగా ఉంటే అత్యవసర పరిస్థితిలో తరచుగా ఉపయోగిస్తారు.[14] రేడియో అబ్లేషన్ ప్రక్రియతో కొంతమందిలో పునరావృతమవడాన్ని నిరోధించవచ్చు .[15] స్ట్రోక్ ప్రమాదం తక్కువగా ఉన్నవారికి, ఎ.ఎఫ్. కి రక్తం పలుచబడటం అవసరం లేదు, అయితే కొంతమంది ఆరోగ్య సంరక్షకులు ఆస్పిరిన్ లేదా గడ్డకట్టడం నిరోధించే మందులను సూచిస్తారు. ప్రమాదం తక్కువ ఉన్నవారికి, నిపుణులు సాధారణంగా గడ్డకట్టే మందులను సిఫార్సు చేస్తారు.[16] గడ్డకట్టడం నిరోధించే మందులలో వార్ఫరిన్, ఎపిక్సాబాన్ ఉన్నాయి .[17] చాలా మందికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది .[18] ఈ మందులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించినప్పటికీ, అవి పెద్ద రక్తస్రావం రేట్లను పెంచుతాయి .[19]

ప్రాబల్యం

[మార్చు]

అత్యంత సాధారణంగా ప్రభావితమయే కర్ణిక దడ అనేది గుండె తీవ్రమైన అసాధారణ లయ, 2020 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 33 మిలియన్లకు పైగా ప్రజలను ప్రభావితం చేసింది.[20][21] 2014 నాటికి, ఇది యూరప్, ఉత్తర అమెరికా జనాభాలో 2 నుండి 3% మందిని ప్రభావితం చేసింది.[22] ఇది 2005 నాటికి జనాభాలో 0.40% నుండి 1% కు పెరిగింది.[23] అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 0.6% మంది పురుషులు, 0.4% మంది మహిళలు ప్రభావితమవుతున్నారు. ఎ.ఎఫ్.తో ఉన్న వ్యక్తులు 50 ఏళ్లలోపు వారు 0.01%, 60 నుండి 70 సంవత్సరాల మధ్య 4% ఇంకా 80 ఏళ్ల వయస్సులో 14% శాతం ప్రభావితం అయ్యారు.[22] దీని ఫలితంగా 2015 లో 193,300 మరణాలు సంభవించాయి, 1990 లో 29,000 పైగా.[24][25] ఎ.ఎఫ్. మొట్టమొదటి నివేదిక 1749లో జీన్-బాప్టిస్ట్ డి సెనాక్ ఇచ్చాడు. 1909లో ECG ద్వారా దీనిని నమోదు చేసిన మొదటి వైద్యుడు థామస్ లూయిస్.[20]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  1. గుండె
  2. గుండెపోటు
  3. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్

సూచనలు

[మార్చు]
  1. "Heart Disease Other Related Conditions". cdc.gov. 3 September 2014. Archived from the original on 14 February 2015. Retrieved 19 February 2015.
  2. Zoni-Berisso, M; Lercari, F; Carazza, T; Domenicucci, S (2014). "Epidemiology of atrial fibrillation: European perspective". Clinical Epidemiology. 6: 213–20. doi:10.2147/CLEP.S47385. PMC 4064952. PMID 24966695.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  3. Bun, Sok-Sithikun; Latcu, Decebal Gabriel; Marchlinski, Francis; Saoudi, Nadir (2 April 2015). "Atrial flutter: more than just one of a kind". European Heart Journal. 36 (35). Oxford University Press (OUP): 2356–2363. doi:10.1093/eurheartj/ehv118. ISSN 0195-668X. PMID 25838435.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 డా.గుడపాటి, రమేష్ (2024-09-14). "గుప్పెడంత గుండె పై ఉప్పెనంత ఒత్తిడి". ఈనాడు.
  5. 5.0 5.1 5.2 Munger, TM; Wu, LQ; Shen, WK (January 2014). "Atrial fibrillation". Journal of Biomedical Research. 28 (1): 1–17. doi:10.7555/JBR.28.20130191. PMC 3904170. PMID 24474959.
  6. Gray, David (2010). Chamberlain's Symptoms and Signs in Clinical Medicine: An Introduction to Medical Diagnosis (13th ed.). London: Hodder Arnold. pp. 70–71. ISBN 9780340974254.
  7. Richard D. Urman; Linda S. Aglio; Robert W. Lekowski, eds. (2015). Essential clinical anesthesia review : keywords, questions and answers for the boards. p. 480. ISBN 9781107681309. Archived from the original on 8 September 2017.
  8. 8.0 8.1 Richard D. Urman; Linda S. Aglio; Robert W. Lekowski, eds. (2015). Essential clinical anesthesia review : keywords, questions and answers for the boards. p. 480. ISBN 9781107681309. Archived from the original on 8 September 2017.
  9. 9.0 9.1 (November 2014). "Risk Factors and Genetics of Atrial Fibrillation.".
  10. (10 September 2013). "Review of epidemiology and management of atrial fibrillation in developing countries.".
  11. 11.0 11.1 (April 2013). "Insights into atrial fibrillation.".
  12. . "Atrial fibrillation: stroke prevention in focus".
  13. Chung, MK; Eckhardt, LL; Chen, LY; Ahmed, HM; Gopinathannair, R; Joglar, JA; Noseworthy, PA; Pack, QR; Sanders, P; Trulock, KM; American Heart Association Electrocardiography and Arrhythmias Committee and Exercise Cardiac Rehabilitation, and Secondary Prevention; Committee of the Council on Clinical Cardiology; Council on Arteriosclerosis, Thrombosis and Vascular Biology; Council on Cardiovascular and Stroke Nursing; Council on Lifestyle and Cardiometabolic Health (March 2020). "Lifestyle and Risk Factor Modification for Reduction of Atrial Fibrillation: A Scientific Statement From the American Heart Association". Circulation. 141 (16): e1-23. doi:10.1161/CIR.0000000000000748. PMID 32148086.
  14. Oishi, ML; Xing, S (February 2013). "Atrial fibrillation: management strategies in the emergency department". Emergency Medicine Practice. 15 (2): 1–26, quiz 27. PMID 23369365.
  15. Amerena, JV; Walters, TE; Mirzaee, S; Kalman, JM (4 November 2013). "Update on the management of atrial fibrillation". The Medical Journal of Australia. 199 (9): 592–97. doi:10.5694/mja13.10191. PMID 24182224.
  16. Freedman, B; Potpara, TS; Lip, GY (20 August 2016). "Stroke prevention in atrial fibrillation". Lancet. 388 (10046): 806–17. doi:10.1016/S0140-6736(16)31257-0. PMID 27560276. S2CID 5578741.
  17. "[146] Apixaban is safer and more effective than rivaroxaban for non-valvular atrial fibrillation" (in కెనడియన్ ఇంగ్లీష్). Therapeutics Initiative. 12 February 2024. Archived from the original on 27 March 2024. Retrieved 24 March 2024.
  18. Kirchhof, Paulus; Benussi, Stefano (27 August 2016). "2016 ESC Guidelines for the management of atrial fibrillation developed in collaboration with EACTS". European Heart Journal. 37 (38): 2893–962. doi:10.1093/eurheartj/ehw210. PMID 27567408.
  19. Steinberg, BA; Piccini, JP (14 April 2014). "Anticoagulation in atrial fibrillation". BMJ (Clinical Research Ed.). 348: g2116. doi:10.1136/bmj.g2116. PMC 4688652. PMID 24733535.
  20. 20.0 20.1 (January 2014). "Atrial fibrillation.".
  21. (March 2020). "Lifestyle and Risk Factor Modification for Reduction of Atrial Fibrillation: A Scientific Statement From the American Heart Association".
  22. 22.0 22.1 (2014). "Epidemiology of atrial fibrillation: European perspective.".
  23. . "ACC/AHA/ESC 2006 Guidelines for the Management of Patients with Atrial Fibrillation: a report of the American College of Cardiology/American Heart Association Task Force on Practice Guidelines and the European Society of Cardiology Committee for Practice Guidelines (Writing Committee to Revise the 2001 Guidelines for the Management of Patients With Atrial Fibrillation): developed in collaboration with the European Heart Rhythm Association and the Heart Rhythm Society".
  24. (8 October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980–2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015".
  25. (17 December 2014). "Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990–2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013.".