Jump to content

వెబ్‌క్యామ్

వికీపీడియా నుండి
అనేక వ్యక్తిగత కంప్యూటర్లతో ఉపయోగించే సాధారణ తక్కువ ధర వెబ్‌క్యామ్‌
ఒక వెబ్ కామ్‌ యొక్క ఎక్స్-రే చిత్రాల యానిమేటెడ్ సెట్. ఈ చిత్రాలు పారిశ్రామిక కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కానింగ్ ఉపయోగించి పొందుపరచుకున్నవి.

వెబ్‌క్యామ్‌ లేదా వెబ్ కెమెరా అనేది ఒక వీడియో కెమెరా, అది కంప్యూటర్ నెట్వర్క్ ఉన్న కంప్యూటర్ ద్వారా నిజ సమయంలో తీస్తున్న చిత్రాన్ని ప్రవహింపజేస్తుంది. కంప్యూటర్ ద్వారా వెబ్ కామ్‌ వాడుతూ వీడియోను ప్రవహింపజేయడమేకాక, తీస్తున్న వీడియోను కంప్యూటరులో భద్రపరచుకోవచ్చు, స్క్రీన్ పై ఇది చూపిస్తున్న చిత్రాన్ని ఫోటోలా సంగ్రహించవచ్చు, ఆ సంగ్రహ చిత్రాన్ని మామూలు వీడియో, ఫోటోలలాగానే ఇతర కంప్యూటర్ నెట్వర్క్ లకు చేరవేసేందుకు ఇమెయల్ జోడింపుగా ఇంటర్నెట్ లో పంపవచ్చు. వెబ్‌కామ్ సాధారణంగా యుఎస్‌బి కేబుల్ లేదా సిమిలార్ కేబుల్ ద్వారా కంప్యూటరుతో అనుసంధానం చేయబడుతుంది. వెబ్‌కామ్ ల్యాప్‌టాప్ లో ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది, ఇది సాధారణంగా ల్యాప్‌టాప్ స్క్రీన్ పైభాగానున్న అంచులో మధ్యగా ల్యాప్‌టాప్ తెరచినప్పుడు స్క్రీన్ ఎదురుగా నున్నదాని చూపించేలా అమర్చబడి ఉంటుంది. దూర ప్రాంతాలలో ఉన్నవారితో ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యంగా ఎదుటనున్న వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా వీలు కల్పిస్తున్నవి ఈ వెబ్‌క్యామ్‌లు. వెబ్‌కామ్‌లలోని సామర్ధాన్ని బట్టి కంప్యూటర్ తెరపై చిత్ర నాణ్యత ఉంటుంది. వెబ్‌కామ్‌కు లెన్సును సరిచేసే సౌకర్యం ఉన్నట్లయితే దానిని సరిచేయటం ద్వారా చిత్ర నాణ్యతను పెంచుకోవచ్చు. సాధారణంగా దీని సామర్ధ్యాన్ని మెగా పిక్సెల్ లో చూపిస్తారు. వీటి ధరలు అందుబాటులో ఉండటం వలన, వాడటం సులభం కనుక అనేకమంది వీటిని వీడియో కాలింగ్‌లలోను, వీడియో కాన్ఫరెన్స్‌లలోను ఉపయోగిస్తున్నారు. ఇన్‌బిల్ట్ కాని ప్రత్యేకంగా వెబ్‌కామ్ పెట్టుకుని వాడుకునే కంప్యూటర్లలలో దాని సంబంధిత ప్రోగ్రామును ఇన్‌స్టాల్ చేయవలసి ఉంటుంది. కొన్ని రకాల వెబ్‌కామ్‌లలో వెలుగును పెంచుకునేందుకు లైటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది.

మూలాలు

[మార్చు]