వెరియర్ ఎల్విన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెరియర్ ఎల్విన్ (29 ఆగస్టు 1902 – 22 ఫిబ్రవరి 1964)[1] రాజనీతి పండితుడు, భారతీయ గిరజన జాతుల సమర్థకుడు. ఆంగ్లేయునిగా జన్మించిన వెరియర్ కాలక్రమేణా భారతదేశాన్ని తన కార్యక్షేత్రంగా స్వీకరించి, భారత పౌరుడయ్యారు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

1902లో ఆంగ్ల క్రైస్తవ బిషప్ కుమారునిగా వెరియర్ ఎల్విన్ జన్మించారు. మత ఛాందసవాదాన్ని తీవ్రంగా పాటిస్తూండే కుటుంబ స్థితిగతులు తట్టుకోలేకపోయేవారు. ఇంగ్లీషులో థియాలజీలో ఫస్టుక్లాస్ డిగ్రీ సంపాదించుకున్నారు.

భారత దేశ ఆగమనం[మార్చు]

1927లో తన కుటుంబ ఛాందసత్వం, కట్టుబాట్లు తట్టుకోలేక దీక్షపొందిన మతబోధకునిగా భారతదేశం వచ్చారు. భారతదేశంలో క్రైస్తవాన్ని నెలకొల్పి, విస్తరించడానికి ఏర్పడ్డ క్రీస్తు సేవాసంఘం (సిఎస్ఎస్)లో చేరారు. సిఎస్ఎస్ కార్యకలాపాల్లో భాగంగానే ఆయన భారత దేశాగమనం జరిగింది. పూనా నగరం సిఎస్ఎస్ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉండేది. వెరియర్ ఎల్విన్ మొదట అక్కడే ఉండి పనిచేసేవారు.

సేవారంగంలోకి[మార్చు]

వెరియర్ ఎల్విన్ పూణెలో ఉన్న కాలంలోనే కమలాదేవి ఛటోపాధ్యాయ కూడా అదే నగరంలో జీవించేవారు. ఆమెతో వెరియర్ స్నేహం చేసి ఆమె భావాల పట్ల అవగాహన కల్పించుకున్నారు. అంతేకాక అహ్మదాబాద్లోని తన ఆశ్రమం నుంచి తరచు పుణె వచ్చివెళ్ళే మహాత్మా గాంధీతో మరింత గాఢమైన, పరివర్తనా పూర్వకమైన సంబంధం ఏర్పడింది. మహాత్మా గాంధీ ఆయనను ఎంతగానో ఆకర్షించారు[2]. ఏసుక్రీస్తు సువార్తకు మహాత్ముడు ఆధునిక వ్యాఖ్యానకారుడన్నది వెరియర్ కు కలిగిన అభిప్రాయం.
ఈ ప్రసిద్ధ చింతనాశీలురు, కార్యకుశలురు అయిన భారతీయుల పరిచయం ఆయనను భారతదేశంలో తన కార్యక్షేత్రాన్ని విస్తరించుకోవడం వైపు ఆలోచించనిచ్చింది. 1931లో సిఎస్ఎస్ కార్యకలాపాలు వదిలిపెట్టి భారతీయ జీవనంతో మరింత ప్రత్యక్ష సంబంధం కల్పించుకునేందుకు ప్రయత్నాలు సాగించారు. మొదట బొంబాయి నగరంలోని దళితుల ప్రాంతంలో నివాసం ఏర్పరుచుకునే ప్రయత్నం చేశారు. అయితే మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లోని ఆదివాసులతో కలిసి సామాజిక, సేవా రంగాల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నారు.

ఆదివాసుల సముద్ధరణ[మార్చు]

తన మిత్రుడు షామ్ రావ్ హివాలేతో కలిసి మొదట నర్మదాలోయలోని ఎగువప్రాంతపు గోండు గ్రామానికి వెళ్ళాడు. అక్కడ గోండు జాతుల వారికి ఆధునిక విద్య, వైద్యం, ఆరోగ్య పరిరక్షణ అందించేందుకు కృషిచేశారు. నిజానికి భారతదేశంలో క్రైస్తవాన్ని విస్తరించడానికి వచ్చిన ఎల్విన్ గోండుల సంస్కృతిలోని సంగీతం, నృత్యం, లైంగిక సంబంధాల్లో విముక్తమైన వారి ప్రకృతి వంటి అనేకాంశాలు పరిశీలించినాకా తానే వారి మతంలోకి మారిపోయారు.

మూలాలు[మార్చు]

  1. Levens, R.G.C., ed. (1964). Merton College Register 1900-1964. Oxford: Basil Blackwell. p. 143.
  2. World of Verrier Elwin[permanent dead link] by K. L. Kamat,8 August 2000.

బయటి లంకెలు[మార్చు]

  • The Muria and Their Ghotul by Verrier Elwin
  • Warren E. Roberts, 'Verrier Elwin (1902–1964)', Asian Folklore Studies 23:2 (1964), 212–14
  • The Tribal World of Verrier Elwin, An Autobiography, Oxford University Press (1964)
  • Beating a dead horse Verrier Elwin