వేగి వెంకటేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేగి వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సంఘ సేవకుడు.

2024 భారత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వై. ఎస్. షర్మిళ 2024 ఎన్నికలకు గాను వెంకటేష్ ను రాష్ట్ర ఎన్నికల కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ చైర్మెన్ గా నియమించారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన వెంకటేష్ దీర్ఘ కాలంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ వివిధ సేవా కార్యక్రమాలు, ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. యువజన కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసారు

కాంగ్రెస్ పార్టీలో పదవులు

వేగి వెంకటేష్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో క్రియాశీలకంగా పనిచేశారు .

  • తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల యువజన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంభందించి ఎన్నికల అధికారి
  • తెలంగాణా రాష్ట్ర ఎఐసిసి సంస్థాగత ఎన్నికల నిర్వహణలో ఎపిఆర్వో
  • ఎపి రాజీవ్ గాంధీ పంచాయితీ రాజ్ సంఘటన్ రాష్ట్ర సమన్వయకర్త
  • యువజన కాంగ్రెస్ ఎన్నికల ఆథారిటీకి ఎన్నికల కమీషనర్
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో ఉపాధ్యక్షుడు
  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో 2024 సార్వత్రిక ఎన్నికల వార్ రూమ్ చైర్మెన్

మూలాలు

  1. Youth Cong. sets in motion organisational poll process in Kerala
  2. ఎపిలో కాంగ్రెస్ అభ్యర్ధులు ఖరారు