వేణుగోపాలస్వామి ఆలయం, రాజమండ్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజమండ్రి నగరంలోని వేణుగోపాలస్వామి ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధిచెందినది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్ది ప్రారంభంలో కాకతీయుల్ని జయించిన ఉలూఘ్ ఖాన్ ధ్వంసం చేసి పెద్దమసీదు నిర్మించాడు.

చరిత్ర[మార్చు]

రాజమహేంద్రవరం నగరానికి క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామికి నిర్మించిన ఈ పేరుపొందిన ఆలయాన్ని క్రీ.శ.1323వ సంవత్సరంలో తుగ్లక్ సేనాని ఉలూక్ ఖాన్ కూల్చివేశాడు. 14వ శతాబ్దంలో ఓరుగల్లు రాజధానిగా ఉన్న కాకతీయ సామ్రాజ్యాన్ని కూలదోసి, కంచికి వెళ్తూన్న ఉలూగ్ ఖాన్ రాజమహేంద్రవరంలో విడిదిచేసి, వేణుగోపాలస్వామి ఆలయాన్ని పడగొట్టించాడు. ఆలయం ఉన్న స్థానంలో ఆంధ్రప్రదేశ్ కెల్లా మొట్టమొదటి మసీదును నిర్మించాడు. దానినే ప్రస్తుతం పెద్ద మసీదుగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలోని వేణుగోపాలస్వామి విగ్రహాన్ని అర్చకులు కంభం వారి సత్రం వీధిలోని ఒక సందులో దాచి భద్రపరిచారు. ఆ విగ్రహాన్ని రెడ్డిరాజుల పాలనలో క్రీ.శ.1390 సంవత్సరంలో పున:ప్రతిష్ఠించారు. రెడ్డిరాజులు ఆలయానికి అనపర్తి గ్రామాన్ని కూడా దానంగా ఇచ్చారు. ఆలయం నాలుగు దశాబ్దాల కాలంలో శిథిలావస్థకు చేరుకోవడంతో తిరిగి 18వ శతాబ్దంలో కొచ్చెర్లకోట జమీందారు వేంకట నారాయణ ఆలయాన్ని పునర్నిర్మించారు.[1]

మూలాలు[మార్చు]

  1. వల్లూరి, విజయ హనుమంతరావు (జనవరి 2015). "మన చరిత్రరచన". సుపథ. 15 (2): 13.