వేదము వెంకటకృష్ణశర్మ
Appearance
(వేదం వెంకటకృష్ణశర్మ నుండి దారిమార్పు చెందింది)
వేదము వేంకటకృష్ణశర్మ | |
---|---|
జననం | వేదము వేంకటకృష్ణశర్మ 1899 చిత్తూరు జిల్లా కార్వేటినగరం |
మరణం | 1973 |
ప్రసిద్ధి | ప్రముఖ కవి, పండితుడు, అనువాదకుడు |
మతం | హిందూ |
పిల్లలు | ఉదయరంజని |
తండ్రి | శ్రీరామయ్య |
తల్లి | సుబ్బనర్సమ్మ |
వేదము వెంకటకృష్ణశర్మ తెలుగు కవి, పండితుడు, అనువాదకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]వేదము వేంకటకృష్ణశర్మ చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో శ్రీరామయ్య, సుబ్బనరసమ్మ దంపతులకు జన్మించాడు. స్మార్త బ్రాహ్మణుడు. కౌశిక గోత్రజుడు. ఇతని పూర్వీకులు కార్వేటి నగర సంస్థానంలో పేరుగడించి రాజాదరణ పొందిన పండితప్రకాండులు. ఇతడు తన 15 ఏటనే కార్వేటి నగరంలో 'ఆమ్నాయ నిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. పొట్టకూటి కోసం ఇతడు కడప జిల్లా కోడూరులోని క్రైస్తవ మిషనరీలో క్రైస్తవ గ్రంథాలను తెలుగులోనికి అనువదించే ఉద్యోగంలో చేరాడు. తరువాత మద్రాసు చేరుకుని అక్కడి కన్యకాపరమేశ్వరీ దేవస్థానం వారి హైస్కూలులో ఆంధ్ర ఉపాధ్యాయుడిగా పనిచేసి 1950లో రిటైర్ అయ్యాడు.
సాహిత్యసేవ
[మార్చు]ఇతనిది ప్రౌఢ గంభీర శైలి. భావసంపద కలిగి పదలాలిత్యముతో కవిత్వం అల్లగలడు. ఇతని గ్రంథాలు కొన్ని విశ్వవిద్యాలయ పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
రచనలు
[మార్చు]- సద్ధర్మ ప్రబోధిని
- కలి నిగర్హణము
- ఆంధ్ర పాండవ గీతలు
- శిష్య నీతిబోధినీ శతకము
- తోడేటి దొరతనము
- భక్తకల్ప శతకము
- ధర్మవిమర్శనము
- కుందమాల
- భామినీ విలాసము
- ఊరు భంగము
- తేనెసోనలు (నాలుగు సంపుటాలు)
- భక్తవత్సల శతకము
- శ్రీరామ(లక్ష్మీ)స్వభావము
- శ్రీసోమశేఖరీయము (సభారంజన శతకము)
- శ్రీకృష్ణశాస్త్రీయము (కలివిడంబన శతకము)
- నెహ్రూ కావ్యము
- అభినవాంధ్ర కాదంబరి
- శతక వాజ్మయ సర్వస్వము (రెండు సంపుటాలు)
- శ్రీ ఆంజనేయ కవీయము (చారుచర్య)
- అమెరికా మహాపురష చరితము
- పద్మ ప్రాభృతకము
- బాలభారతము
- మహాపురుష శతకము
- ఝాన్సీ మహారాణి
- భక్తియోగము
- ఆరణ్యకజాతులు
- మహేశమాల (సంస్కృత శ్లోకాలు)
- విష్ణుమహామాయావిలాసము
- బౌద్ధ ధర్మదీక్ష
- సుభాషిత రత్నమాల
బిరుదులు/సన్మానాలు
[మార్చు]- పండితోపాధ్యాయ పరిషత్ వారు ఇతనికి విద్వత్కవిభూషణ అనే బిరుదు ఇచ్చారు.
- 1961లో కడప జిల్లా రాజంపేట లో మాడభూషి అనంతశయనం అయ్యంగార్ ఆధ్వర్యంలో పౌరసన్మానం జరిగింది.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- రాయలసీమ రచయితల చరిత్ర,మొదటి సంపుటి, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం 101వపేజీ.