వేదాంతం వెంకట నాగ చలపతిరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాంతం వెంకట నాగ చలపతిరావు కూచిపూడి నాట్యాచార్యుడు. ఆయన కూచిపూడి కళానికేతన్‌ వ్యవస్థాపకులు. తెలుగు వారికి సొంతమైన 'కూచిపూడి యక్షగానం' కళను మొట్టమొదటిసారిగా ఇతర దేశాలలో ప్రదర్శించారు. 'జయతే కూచిపూడి' పేరుతో 9 దేశాలలో 14 ప్రదర్శనలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 13 మంది, తెలంగాణ రాష్ట్రం నుంచి 12 మంది కళాకారులు ఈ బృందంలో ఉన్నారు. [1]

జివిత విశేషాలు

[మార్చు]

ఆయన తన ఐదేళ్ళ వయసు నుండి నాట్యశాస్త్రంపై మక్కువ పెంచుకున్నాడు. ఆయన తండ్రి వేదాంతం రత్తయ్య శర్మ ఆయనను కూచిపూడి యక్షగాన సాంప్రదాయ కళాకారునిగా మలిచారు. ఆయన యక్షగానంలో స్త్రీపాత్రలతో కూడా ప్రదర్శనలిచ్చేవాడు. ఆయన తన చిన్నాన్నలైన వేదాంతం రాఘవయ్య, వేదాంతం రాధేశ్యాం, ప్రముఖ నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం, వేదాంతం సత్యనారాయణ శర్మల నుండి ప్రశంసలు పొందాడు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంది పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందాడు.[2]

ఆయన స్త్రీవేషంలో ప్రదర్శనలతో అధ్బుతంగా ప్రేక్షకులను రంజింపజేస్తారు. స్త్రీలలా విన్యాసం, నడక, కంఠమాధుర్యం, సంజ్ఞలు, అభినయం ప్రదర్శనలో ఆకర్షిస్తాయి.[3]

పురస్కారాలు

[మార్చు]
  • 2006 లో భిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం.[4]
  • ఆయన భారతదెశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నాట్య ఉత్సవాలలో పాల్గొన్నారు. అందులో ఖజరహో నాట్య ఉత్సవం, టైమ్స్ ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ముఖ్యమైనవి.
  • సోలో ప్రదర్శనలను చైనా, జపాన్ దేశాలలో యిచ్చారు.
  • ఆయన యు.ఎస్.ఎ లో వర్క్ షాప్ లను నిర్వహించారు.
  • కూచిపూడి కళానికేతన్ ను స్థాపించి యువ కళాకారులను తయారుచేస్తున్నారు.[

మూలాలు

[మార్చు]
  1. దిగ్విజయంగా 'జయతే కూచిపూడి'[permanent dead link]
  2. "Vedantam Venkata Naga Chalapathi Rao". Archived from the original on 2016-10-27. Retrieved 2016-11-12.
  3. "Every moment was entertaining". RUPA SRIKANTH. The Hindu. 23 January 2009. Retrieved 11 November 2016.
  4. కూచిపూడికి చెందిన నలుగురికి సంగీత నాటక అకాడమీ పురస్కారాలు[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]