వేదాంతం సత్యనారాయణ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేదాంతం సత్యనారాయణ శర్మ
వేదాంతం సత్యనారాయణ శర్మ
జననంవేదాంతం సత్యనారాయణ శర్మ
సెప్టెంబరు 9, 1935
కృష్ణా జిల్లా కూచిపూడి
మరణంనవంబరు 15, 2012
విజయవాడ
ఇతర పేర్లువేదాంతం సత్యనారాయణ శర్మ
ప్రసిద్ధికూచిపూడి నృత్య కళాకారుడు.
భార్య / భర్తలక్ష్మీనరసమ్మ
పిల్లలుకుమార్తెలు : నాగలక్ష్మి, రాధ
కుమారుడు : వేంకట నాగప్రసాద్‌
తండ్రివేదాంతం వెంకటరత్నం
తల్లిసుబ్బమ్మ

వేదాంతం సత్యనారాయణ శర్మ (సెప్టెంబరు 9, 1935 - నవంబరు 15, 2012) కూచిపూడి నృత్య కళాకారులు, రంగస్థల నటులు.

జీవిత విశేషాలు

[మార్చు]

వేదాంతం సత్యనారాయణ శర్మ 1935 సెప్టెంబరు 9కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో జన్మించారు. కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్య గురువులు వేదాంతం ప్రహ్లదశర్మ నాట్యంలో అరంగేట్రం చేయించారు. దివంగత వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్త్రి వద్ద శిక్షణ పొంది యక్షగానాలు, భామా కలాపాలు, నాటకాలు, భరత కళా ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి వద్ద నాట్యంలో తర్ఫీదుపొందారు. కూచిపూడి సంగీతాన్ని, వయోలిన్‌ను కూడా చిన్న వయస్సులోనే ఔపోసన పట్టారు. తన 18వ యేటనే అనగా 1953లో ఢిల్లీలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ సమక్షంలో ఉషాపరిణయం నాటకంలో పార్వతీ పాత్రను పోషించి స్త్రీ పాత్రధారణకు ప్రాణం పోశారు. అప్పటి నుంచి స్త్రీ పాత్రలలో రాణించారు. అభినవ సత్యభామగా సత్యనారాయణ శర్మ మంచి గుర్తింపు పొందారు. దేశ విదేశాలలో సత్యనారాయణశర్మ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన పద్మశ్రీ పురస్కారం, కేంద్ర సంగీత నాటక అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ నృత్య అకాడమీ, భారత కళా ప్రపూర్ణ, కళాదాస్‌ సన్మాన అవార్డులను అందుకున్నారు. భామా కలాపంలో సత్యభామ, శ్రీకృష్ణుడు, సూత్రధారులనే మూడు పాత్రలతో నడిచిన శృంగార, భక్తి, జ్ఞాన, వైరాగ్య బోదకమైన ముచ్చటగొలిపే నాటక ప్రక్రియ. సత్యభామ పాత్రలు పోషించిన వారు ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎందరో ఉన్నా సమకాలీనంగా గుర్తుకు వచ్చేది ఈయనే. ఆయనకు భార్య ల క్ష్మీ నరసమ్మ, ఇద్దరు కుమార్తెలునాగలక్ష్మి, రాధ, కుమారుడు నాగ ప్రసాద్‌ ఉన్నారు.

పిన్నవయస్సులోనే...

[మార్చు]

తన ఐదవ ఏటనే నృత్యం ఆరంభించాడు. ఇతడి తొలి గురువు వేదాంతం ప్రహ్లాదశర్మ. చింతా కృష్ణమూర్తి ద్వారా యక్షగానం, లక్ష్మీనారాయణ శాస్త్రి ద్వారా భరతనాట్యం నేర్చుకున్నాడు. సత్యభామ, ఉష, దేవాదేవి, విశ్వమోహినీ పాత్రలను అమోఘంగా పోషించాడు.

తొమ్మిది సంవత్సరాల వయస్సులోనే కూచిపూడి డాన్స్‌ను అభ్యసించిన వేదాంతం సత్యనారాయణ శర్మ. తన సోదరుడు వేదాంతం ప్రహ్లాదశర్మ పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకున్నాడు. తన సోదరుడు ప్రధాన మహిళా ప్త్రాల్లో నటించినది పసుమర్తి కొండలరాయుడు బృందంలో...అప్పటికే సత్యనారాయణ వారితో కలిసి బాల ప్త్రాలు ప్రారంభించారు. తన 19వ ఏట మహంకాళి శ్రీరాములుతో కలిసి ఉషా పరిణయంలో పార్వతి ప్త్రావేయడానికి అవకాశం వచ్చింది. అంతే వెనుతిరిగి చూడలేదు... స్త్రీ పాత్రల్లోనే వివిధ వేషాలు కడుతూ వారితో అంచెలంచెలుగా ప్రపంచస్థాయి గుర్తింపు పొందారు. స్త్రీ పాత్ర పరివర్తనను పూర్తి ఆకళింపు చేసుకున్నారు. వారి ఆహార్యం అవపోసన పట్టారు.

ఆమె కాదు... కాదు అతను

[మార్చు]

వేదాంతం సత్యనారాయణ శర్మ తన నటనాచాతుర్యంతో స్త్రీ వేషం అందునా సత్యభామగా... ఉష... మోహినీ... దేవదేవిగా అందరినీ అందునా స్త్రీలనే మైమరిపించారు. రంగస్థలంపై ఆమె కాదు... కాదు ... అతను. ఆడవారివలే ెయలు ఒలకబోసుకుని రంగస్థలంపై విశ్వరూపం చూపిన జగమెరిగిన నాట్యస్రష్ఠ పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ. ప్రపంచవ్యాప్తంగా నాట్యప్రియుల మదిని దోచిన ఆ ప్రదర్శనలు ఓ అద్భుతఘట్టం. మహిళలను సైతం మంత్రముగ్ధులను చేయగల వారి కళాప్రావీణం అనన్య సామాన్యం. నవరసాలు రంగస్థలంపై ఆలవోకగా పండిచగల దిట్ట ఆంధ్ర కూచిపూడి నాట్యాచార్యుడు వేదాంతం సత్య నారాయణ శర్మ. సంగీత సాహిత్యాలు సమ్మిళితం చేసి...వాటిని ఆచరించిన అభినయం కళాభిమానుల నుంచి జేజేలు అందుకున్నారు.

ఉషాపరిణయంలో ఉషగా, చెలికత్తెగా ఆయన ప్రదర్శించిన ఆంగిక, వాచకాభినయం ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది. ఓ మహిళగా... అందునా సత్యభామ ప్త్రాకు పరిపూర్ణత ఇచ్చింది వేదాంతం సత్యనారాయణ శర్మకే సరిపోతుంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ శర్శ కూచిపూడి నాట్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. ‘‘భామా కలాపం నృత్యరూపకంలో సత్యభామగా వేదాంతం సత్యనారాయణ శర్మ పోషించిన పాత్ర పాత్ర జాతీయ స్థాయిలో ప్రశంసలందుకుంది.

బిరుదులు, గౌరవాలు

[మార్చు]

కూచిపూడి నాట్య ప్రదర్శనల ద్వారా వేదాంతం సత్యనారాయణ శర్మ మన తొలి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్టప్రతులు వివి గిరి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి, డా. శంకర్‌దయాళ్ శర్మ, డా. జకీర్ హెస్సేన్, డా. ఆర్‌కె నారాయణన్‌ల ద్వారా ప్రశంసలు, అభినందనలు పొందారు. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ప్రధాన మంత్రులుగా ఇందిరాగాంధీ, పి. వి. నరసింహారావు ఈయన నృత్య ప్రదర్శనను తిలకించి అభినందించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1988లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కాళిదాస్ సమ్మాన్ అవార్డుతో సత్కరించింది. 2005లో తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హంస అవార్డును అందచేసింది. సిద్ధేంద్రయోగి నర్తన అవార్డును అందుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం భరతముని అవార్డుతో సత్కరించింది.

  • సంగీత నాటక అకాడమీ అవార్డు,
  • పద్మశ్రీ అవార్డు.
  • కాళిదాస్ సమ్మాన్.

2012 నవంబరు 15 న విజయవాడలో మరణించాడు.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కూచిపూడి గ్రామంలో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మ దంపతుల కడసారి కుమారుడెైన పద్మశ్రీ వేదాంతం సత్యన్నారాయణ శర్మకు భార్య లక్ష్మీ నరసమ్మ, కుమార్తెలు నాగలక్ష్మీ, రాధ, కుమారుడు వేంకట నాగప్రసాద్‌లు ఉన్నారు.[2]

ఇవీ చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]