వేదాంతం ప్రహ్లాదశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాంతం ప్రహ్లాదశర్మ(1923 - 1991) కూచిపూడి నాట్యాచార్యుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన కూచిపూడి నటుడు, నృత్యకారుడు. ఆయన ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులైన వేదాంతం సత్యనారాయణ శర్మ యొక్క సోదరుడు. ఆయన తన సోదరునికి కూచిపూడి నాట్యంలొ శిక్షణనిచ్చాడు.[2] ఆయన కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో 1923లో వేదాంతం వెంకటరత్నం, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఆయన వేదాంతం లక్ష్మీనరసింహ శాస్త్రి, వారి కుటుంబ సభ్యుల నుండి శిక్షణ పొందాడు. వారి కుటుంబం కూచిపూడి సాంప్రదాయానికి ప్రసిద్ధమైనది. ఆయన పురుష, స్త్రీ వేషాలను వేసి సభాసదులను రంజింపచేసారు. ఆయన దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చాడు. ఆయన ఏలూరులోని కుచిపూడి కేంద్రమైన సిద్ధేంద్రయోగి కళాక్షేత్రంలొ తన సేవలనందించాడు. ఆయన శిష్యులు రాజా రాధారెడ్డి ప్రముఖ నృత్యకారులు.[3] కూచిపూడి ఇలవేల్పు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో పద్మశ్రీ సత్యనారాయణ శర్మకు 5వ ఏటనే నాట్యంలో అరంగేట్రం చేయించారు. వేదాంతం ప్రహ్లాద శర్మ గారు రాష్ట్రపతి శ్రీ R.వెంకట్రామన్ గారి చేతుల మీదుగా సెంట్రల్ సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు.వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.వీరు కూడా కూచిపూడి నాట్య వారసత్వం కొనసాగించారు.వీరు పద్మశ్రీ అవార్డ్ కు అర్హత కలిగి ఉన్నవారు, చివరి దశలో అది సాధించ లేక పోయారు

పురస్కారాలు[మార్చు]

ఆయనకు 1985లో సంగీత నాటక అకాడమీ పురస్కారం లభించింది.

అస్తమయం[మార్చు]

ఆయన 1991లో మరణించాడు.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]