Jump to content

వేదుల రామకృష్ణశాస్త్రి

వికీపీడియా నుండి

వేదుల రామకృష్ణశాస్త్రి ప్రముఖ జంటకవులు వేంకట రామకృష్ణ కవులలో రెండవవాడు. ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, కాకరపర్రు గ్రామంలో సూరమ్మ, రామచంద్రశాస్త్రి దంపతులకు 1889 సంవత్సరంలో జన్మించాడు[1], [2]. తన మేనమామ కుమారుడైన ఓలేటి వేంకటరామశాస్త్రితో కలిసి వేంకట రామకృష్ణ కవులు పేరుతో జంటగా కవిత్వం చెప్పాడు. ఈ జంటకవులు చర్ల నారాయణశాస్త్రి వద్ద సాహిత్యము, రామడుగుల వీరేశ్వరశాస్త్రి వద్ద శబ్దశాస్త్రము, విశ్వపతిశాస్త్రి వద్ద న్యాయశాస్త్రము నేర్చుకున్నారు. వేదుల రామకృష్ణశాస్త్రి 1918లో తన 29వ యేట మరణించాడు.

రచనలు

[మార్చు]

స్వీయ రచనలు

[మార్చు]
  1. నరకాసురవ్యాయోగము (ఆంధ్రానువాదం)
  2. కుకవినిందనము (ప్రాకృత భాషలో)
  3. కర్ణవిజయ వ్యాయోగము (సంస్కృతభాషలో)

ఓలేటి వేంకటరామశాస్త్రి తో కలిసి జంటగా రచించినవి

[మార్చు]
  1. శతఘ్ని
  2. రామకృష్ణ మహాభారతము[3]
  3. అట్టహాసము
  4. విశ్వగుణాదర్శము (అనువాదం)
  5. ఔచిత్య విచారచర్చ (అనువాదం)
  6. కవి కంఠాభరణము (అనువాదం)
  7. ఇందిరాదేవి (నవల)
  8. సుభద్ర (నవల)
  9. శకుంతల (నవల)
  10. దమయంతి (నవల)
  11. వ్యాసాభ్యుదయము
  12. దమయంతీ కల్యాణము (అచ్చతెలుగు కావ్యము)
  13. ఉత్తరరామచరిత్ర
  14. మదాలస (నాటకము)
  15. భోజచరిత్ర
  16. కాత్యాయన చరిత్ర
  17. సువృత్త తిలకము (అనువాదం)
  18. పాణిగృహీతి
  19. కొండవీటి దండయాత్ర
  20. అత్యద్భుత శతావధానము
  21. పరాస్తపాశుపతము

మూలాలు

[మార్చు]