వై. శ్రీలక్ష్మి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వై. శ్రీలక్ష్మి
జననం1960
వృత్తిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్
జీవిత భాగస్వామిగోపీకృష్ణ

ఎర్ర శ్రీలక్ష్మి 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించింది.

ఓబుళాపురం మైనింగ్ కేసు

[మార్చు]

కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది.[1]ఆమె 2011లో అక్రమ మైనింగు కేసులో అరెస్టవడంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సస్పెండ్‌ చేసింది.[2] శ్రీలక్ష్మి ఏప్రిల్ 2, 2013న చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ తో విడుదలైంది. ఆమె జైలు నుంచి బెయిల్‌పై విడుదలయిన తర్వాత సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తి వేసింది.

డిప్యుటేషన్‌

[మార్చు]

వై.శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి. ఆమెను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఆమె పోస్టల్ అడ్రస్‌ తెలంగాణలో ఉండడంతో ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వానికి కేటాయించింది. ఆమెను తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఆమె 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ కు పంపేందుకు నిరాకరించింది. ఆ నిర్ణయంపై శ్రీలక్షి కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించింది. ఆమె తన సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని దానికి సంబందించిన ఆధారాలను అందజేసింది. క్యాట్ ను ఆశ్రయించిన ఆమె విజయం సాధించింది. క్యాట్ అదేశాలతో కేంద్రప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసింది.

శ్రీలక్ష్మి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించగా 2024 జూన్ 19న ప్రభుత్వంలో జీఏడీకి(సాధారణ పరిపాలన శాఖ) అటాచ్ చేసింది.[3][4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (29 November 2011). "Sri Lakshmi arrested in illegal mining case". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
  2. The New Indian Express (2 December 2011). "Srilakshmi suspended, sent to prison". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.
  3. EENADU (19 June 2024). "శ్రీలక్ష్మి, ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీఏడీకి అటాచ్‌.. భారీగా ఐఏఎస్‌ల బదిలీ". Archived from the original on 20 June 2024. Retrieved 20 June 2024.
  4. EENADU (20 June 2024). "మార్పు మొదలైంది". Archived from the original on 20 June 2024. Retrieved 20 June 2024.