వ్యాక్యూం ట్యూబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆధునిక వ్యాక్యూం ట్యూబులు, చాలావరకు సూక్ష్మ రూపాలు. నిజానికి ఇంతకన్నా పెద్దవిగా ఉండేవి

వ్యాక్యూం ట్యూబు లేదా ఎలక్ట్రాన్ క్యూబ్[1][2][3] లేదా ఇంకా సరళంగా ట్యూబు (అమెరికా), లేదా వాల్వు (బ్రిటన్, పరిసర ప్రాంతాలు) అనేది శూన్యం నింపిన ఒక చిన్న పాత్ర లేదా పెట్టెలోని ఎలక్ట్రోడుల మధ్య విద్యుత్తును నియంత్రించే ఒక పరికరం. దీన్ని 1904 లో జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 20వ శతాబ్ది ప్రథమార్థంలో వ్యాక్యూం ట్యూబ్ రేడియో, టీవీ, కంప్యూటర్లు, పెద్ద టెలీఫోన్ వ్యవస్థలు, రాడార్లు, వివిధ రకాలైన ధ్వని పరికరాల్లో ముఖ్యమైన విడిభాగంగా ఉండటం వల్ల ఈ సాంకేతికతలన్నీ వేగంగా వ్యాప్తి చెందాయి.

1940 లో దీని కన్నా చిన్నవైన, తక్కువ ఖర్చుతో కూడిన, మరింత సమర్ధవంతమైన, దీర్ఘకాలికమైన అర్ధవాహక పరికరాలు కనుగొనడంతో వీటి వాడకం తగ్గిపోయింది. ముఖ్యంగా వీటి స్థానంలో ట్రాన్సిస్టర్లు వచ్చి చేరాయి.

మూలాలు[మార్చు]

  1. Reich, Herbert J. (13 ఏప్రిల్ 2013). Principles of Electron Tubes (PDF). Literary Licensing, LLC. ISBN 978-1258664060. Archived from the original (PDF) on 2 ఏప్రిల్ 2017. Retrieved 6 ఏప్రిల్ 2018.
  2. Fundamental Amplifier Techniques with Electron Tubes: Theory and Practice with Design Methods for Self Construction. Elektor Electronics. January 1, 2011. ISBN 978-0905705934.
  3. "RCA Electron Tube 6BN6/6KS6". Retrieved 2015-04-13.