శంఖవరప్పాడు
శంఖవరప్పాడు | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°53′38″N 80°0′0″E / 15.89389°N 80.00000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | అద్దంకి |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08404 ) |
పిన్‌కోడ్ | 523260 |
శంఖవరప్పాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]ఈ గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రులు, ఈ పాఠశాలలో, ప్రతి సంవత్సరం, 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన తొలి ముగ్గురు విద్యార్థులకు, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, ప్రోత్సాహక నగదు బహుమతులు అందించుచున్నారు.[1]
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, బట్టు నాగమణి సర్పంచిగా ఎన్నికైంది. ఉపసర్పంచిగా పాగల లేయమ్మ ఎన్నికైంది
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ కోదండరామస్వామివారి ఆలయం
[మార్చు]ఈ గ్రామంలోని ఎస్.సి.కాలనీలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం, 2017, ఆగస్టు-9వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, 33 అడుగుల ఎత్తయిన ఏకరాతి ధ్వజస్తంభ ప్రతిష్ఠ, క్రేన్ సహాయంతో ప్రతిష్ఠించారు. ఇంతేగాక జీవధ్వజ, కీర్తిధ్వజ, శిఖర ప్రతిష్ఠను గూడా నిర్వహించారు.[2]